Saturday, May 18, 2024
- Advertisement -

నంది అవార్డ్స్ పై మాట్లాడే వారికోసం టిడిపి అస్త్రం

- Advertisement -

అది 1984 వ సంవత్సరం. మంగమ్మ గారి మనవడు సినిమా తెలుగునాట రికార్డు స్థాయి విజయం సాధించిన సంవత్సరం. కమర్షియల్ హీరో గా బాలయ్య బాబు తొలి విజయం. అందరు ఆమోదముద్రవేసి బల్లగుద్ది చెప్పిన ఇండస్ట్రీ హిట్ సినిమా. తెలుగు దేశం ప్రభుత్వం ఆద్వర్యంలో నంది అవార్డ్స్ ప్రకటించారు. ఇంకేముంది అందరు ముఖ్యమంత్రి NTR కొడుగ్గా బాలయ్యకే అవార్డు అనుకున్నారు. కానీ బాలయ్యకి ఇవ్వలేదు. అంతే కాదు ఆ తర్వాత 1986 లో వరసగా 6 సూపర్ హిట్స్ తెలుగు ఇండస్ట్రీ కి ఇచ్చిన హీరో బాలయ్య. అప్పుడు కూడా బాలయ్య కి నంది అవార్డు ఇవ్వలేదు. ఇక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఎన్టీఆర్ ఏ ముఖ్యమంత్రి గా కూడా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకొనే ఆదిత్య 369 (1991 ) , భైరవ ద్వీపం ( 1994 ) సినిమాలకి కూడా నంది అవార్డు ఇవ్వలేదు.

కలెక్షన్స్ కి కొత్త అర్ధం చెప్పి, తెలుగు సినిమా గతిని మార్చిన “సమర సింహ రెడ్డి” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా కి కూడా అవార్డ్స్ ఇవ్వలేదు. 8 సంవత్సరాలు తండ్రి , 9 సంవత్సరాలు బావ ముఖ్యమంత్రులుగా పనిచేసిన సరే ఏరోజు ఏపని కోసం సెక్రటేరియట్ గడప తొక్కని నైజము మా బాలయ్యది. పైరవీలు చేసే అలవాటే ఉంటే ఈ పాటికి ఒక 10 నందులు నడిచి వచ్చేవి.. కానీ ఏనాడూ అలా చేసే మనిషి కాదు మా బాలయ్య.

ఇక్కడ అందరు ఏడ్చి గగ్గోలు పెడుతున్నట్టు బాలయ్య నంది అవార్డ్స్ జ్యూరీ కమిటీ లో బాలయ్య లేడు. ఆయన రఘుపతి వెంకయ్య అవార్డ్స్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్. అందులో కూడా చిరంజీవి కే అవార్డు వచ్చింది. నంది అవార్డు కమిటీ మెంబెర్ గా మెగా ఫామిలీ కి చెందిన అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. ఇంకా చాలా మండే ఉన్నారు. అవేం తెలియని (పట్టని) మైక్ వుంది కదా అని మాట్లాడటం, కీబోర్డ్ వుంది కదా అని రాతలు రాసేయడం. ఇప్పుడు అవార్డ్స్ గురించి చులకన గా మాట్లాడే మీరు , మీ హీరోలకి వచ్చిన అన్ని అవార్డ్స్ కూడా పైరవీలు చేసే తెచ్చుకున్నారా ?.ఇపుడీ మెసేజ్ సోషల్ మీడియాలో గట్టిగానే చక్కెర్లు కొడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -