Monday, May 6, 2024
- Advertisement -

మీరు కీప్ అని రాసుకున్న ప‌ర్వాలేదంటున్న గాయ‌ని

- Advertisement -

మాములుగా సెల‌బ్రెటీల గురించి తెలుసుకోవాల‌ని.. వారి ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకోవ‌డానికి అంద‌రు ఆస‌క్తి చూపుతుంటారు. ఇది కొంచెం వారికి ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే. కొంద‌రు అసలు గుట్టు విప్ప‌రు. మ‌రికొంద‌రు కావాల‌నే లీక్‌లు ఇస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ వార్త‌ల్లో ఉండాలనుకోవాల‌నో… లేక ఇంకేదైనా కార‌ణం కావ‌చ్చు.

ఏదేమైనా ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్న సెల‌బ్రిటీ మాత్రం ఫుల్ ఓపెన్ అండ్ బోల్డ్‌. గాయని అభయ హిరణ్మయి గురించి తెలుసు కదా. ఆమె చాలా పాటలు పాపులర్ సంగీత దర్శకుడు గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్ష‌న్‌లోనే పాడింది. ఆ పాట‌ల ప్ర‌యాణంతోనే వారి ప్ర‌ణ‌య ప్ర‌యాణం కూడా సాగుతోంది ఇప్పుడు.

ఈ విష‌యాన్ని వాలంటైన్స్ డే రోజు అధికారికంగా ప్ర‌క‌టించేసింది కూడా. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే గోపిసుంద‌ర్‌కు ఇంత‌కుముందు పెళ్ల‌యింది. ఐతే వారి విడాకుల కేసు కోర్టులో ఉంది. కానీ అంత‌కుముందు నుంచి అభయ హిరణ్మయి- గోపిసుంద‌ర్ ప్రేమాయ‌ణం కొన‌సాగుతుంది.

ఇక్క‌డి వ‌ర‌కు మాట్లాడితే బోల్డ్ అని ఎందుకు స‌ర్టిఫికేట్ ఇస్తాం.. త‌ను ఏమందంటే.. నేను ఆయనతో డేటింగులో వున్నా. ఇది ఇప్పటి విషయం కాదు… 9 ఏళ్ల నుంచి ఇదే విధంగా వున్నాం. దీని గురించి మీరు ఏమయినా రాసుకోండి. నన్ను ఆయనకు కీప్ అని రాసుకున్నా ఫర్లేదు. సరిపోదా… ఇంకా ఏదైనా రాస్తామ‌న్నానాకు అభ్యంతరం లేదని చెప్పింది. ఇప్పుడు చెప్పండి హిర‌ణ్మ‌యి బోల్డ్ అండ్ ఓపెనా కాదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -