Friday, April 19, 2024
- Advertisement -

అనుచరులతో అఖిలప్రియ, ఎస్వీ మోహన్‌రెడ్డి మీటింగ్స్…….. ఏం జరుగుతోంది?

- Advertisement -

కర్నూలు సీటు టీజీ వెంకటేష్ కొడుక్కు ఇవ్వడం ఖాయం. ఇక అఖిలప్రియకు, బ్రహ్మానందరెడ్డిలు ఇద్దరికీ సీటు ఇచ్చే పరిస్థితి లేదు. ఇతర నాయకులు అందరూ చంద్రబాబుపై ఆ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో భూమా కుటుంబ నాయకులు ఇప్పుడు ముఖ్య అనుచరులతో వరుసగా చర్చలు చేస్తున్నారు. వైఎస్ జగన్‌ కుటుంబంతో భూమా కుటుంబానికి బంధుత్వం కూడా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు హామీలను అస్సలు నమ్మలేమని, వైఎస్ జగన్‌వైపు వెళితే కనీసం చెప్పిన మాటకు విలువ ఉంటుందని అనుచరులైన నాయకులు, అభిమానులు భూమా కుటుంబ నాయకులకు చెప్తున్నారు.

భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయనపై కావాలని కేసులు పెట్టించిన చంద్రబాబు బలవంతంగా టిడిపిలో చేర్చుకున్నారని…….అయితే ఆ తర్వాత మంత్రి పదవి విషయంలో భూమాను చంద్రబాబు ఓ స్థాయిలో టెన్షన్ పెట్టడం, ఫ్రస్ట్రేట్ చేయడం, చనిపోయిన ముందురోజు కూడా అర్థ రాత్రి వరకూ భూమాకు వార్నింగ్ ఇస్తూ చంద్రబాబు చేసిన రాజకీయం అంతా గుర్తున్న భూమా కుటుంబ నాయకులు ఇప్పుడు చంద్రబాబును అస్సలు నమ్మలేం అని చెప్తున్నారు. వీలైనంత త్వరగా కర్నూలు అసెంబ్లీకి ఎస్వీ మోహన్‌రెడ్డికి అనౌన్స్ చేయడంతో పాటు భూమా అఖిలప్రియతో పాటు బ్రహ్మానందరెడ్డికి కూడా సీటు కన్ఫాం అని చెప్పి చంద్రబాబు అధికారికంగా చెప్తే ఆలోచిస్తామని లేకపోతే వైఎస్ జగన్ పార్టీలో చేరి జగన్‌ని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాయబారం కోసం వచ్చిన ఒక టిడిపి సీనియర్ నాయకుడితో భూమా కుటుంబ నాయకులు తేల్చి చెప్పేశారు.

సీటు విషయంలో పక్కాగా మాట ఇవ్వకపోయినప్పటికీ భూమా కుటుంబం భవిష్యత్ నేను చూసుకుంటాను, రాజకీయంగా శోభానాగిరెడ్డికి అండగా నిలిచినట్టుగా అఖిలప్రియకు అండగా నిలబడతాను అని వైఎస్ జగన్ మాట ఇస్తే వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు భూమా కుటుంబ నాయకులు. ఇప్పుడు ఈ పరిణామాలే టిడిపిలో టెన్షన్ పెంచుతున్నాయి. చంద్రబాబుతో సహా టిడిపి సీనియర్ నాయకులు కూడా భూమా కుటుంబంతో, ఎస్వీ మోహన్‌రెడ్డితో చర్చలు చేస్తున్నారు. భూమా కుటుంబంతో చర్చలు ఫలిస్తాయా? ఆమంచి విషయంలో జరిగినట్టుగానే అఖిలప్రియ అండ్ కో కూడా ‘నిన్ను నమ్మం బాబూ’ అని చెప్పి వైకాపాలో చేరిపోతారా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -