ర్యాప్ సింగర్,నటుడు నోయెల్ పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా క్రిస్టియన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నోయెల్. క్రిస్టియన్ మతస్తుడైన నోయెల్ తన మత మద్దతిలోనే పెళ్లి చేసుకున్నాడు. శనివారం ఉదయం నోయెల్ పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ర్యాప్ సింగర్‌గా ఇండస్ట్రీకి పరిచియమైన నోయెల్ , తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం మొదలుపెట్టిన నోయెల్, పలు సినిమాలలో నటించి ఫేమస్ అయ్యాడు.మగధీర,ఈగ,బాహుబలి వంటి సినిమాలలో నటించాడు.
ఇక కుమారి 21 F సినిమాలో నోయోల్ చేసిన నెగిటివ్ రోల్‌కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత అతనికి పలు సినిమాలలో నటించే అవకాశం దక్కింది. ఇక ఎస్తేర్ నోరోన్హా విషయానికి వస్తే తేజ దర్శకత్వం వహించిన 1000 అబద్దాల సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఓ సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచియం ఏర్పడింది, ఈ పరిచియం కాస్తా ప్రేమగా మారడం,ఆ ప్రేమ పెళ్లిగా మారింది.మేమిద్దరం వేరు కాదు ఒక్కటే అని చెబుతూ.. తను నా మహారాణి అని నోయెల్ ట్వీట్ చేశాడు. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, సింగర్స్ అలాగే దర్శకుడు రాజమౌళి – రమ హాజరయ్యారు.
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
- కొంత వరకే కొత్త మ్యాప్‌నకు మద్దతు: భారత్
