Friday, April 19, 2024
- Advertisement -

ఒళ్లు కప్పుకోకపోతే.. అక్కడ చూస్తారు.. : చిన్మయి

- Advertisement -

చిన్మయి శ్రీపాద కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెబుతోంది. అలానే కాంట్రవర్సీలకు దగ్గరగా కూడా ఉంటుంది. ప్రధానంగా మహిళా హక్కులంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజా మరోసారి ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మధ్యే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి ఇంటికి వచ్చి.. ఆమెను చున్నీ సర్దుకోమని సలహా ఇచ్చాడు.

తనకు జరిగిన అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది ఆ యువతి. స్విగ్గీ.. మీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు వాళ్ల పని వాళ్ళు చేసుకుంటే చాలు.. మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆ యువతి ఘాటుగానే స్పందించింది. మీ డెలవరీ బాయ్ పార్సిల్ ఇచ్చి వెళ్ళాలి కానీ మేడమ్ మీ చున్నీ కప్పుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు.

నా ఇంట్లో నాకు నచ్చినట్లు ఉంటాను.. మీరెవరు చెప్పడానికి.. అయినా ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా మేమే నేర్పించాలా అంటూ ఆమె మండిపడిండి. దాంతీ ఈమె చేసిన ట్వీట్ కాసేపటికి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి చిన్మాయి సపోర్ట్ చేస్తూ.. మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తుంటే.. చిన్నపుడు వాళ్ల అమ్మ రొమ్ము పాలు తాగలేదేమో అనిపిస్తుంది నాకు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పుకోకపోతే వాటి వల్లే రేప్స్ జరుగుతాయనుకునే నీచమైన సమాజంలో మనమున్నామా అంటూ ప్రశ్నిస్తుంది చిన్మయి.. ఈ విషయంలో మరికొందరు ఆ సదరు డెలవరీ ఏజెంట్ బాయ్‌ను కూడా సమర్థిస్తున్నారు. అందులో తప్పేముంది.. ఆమె మంచికోసమే అతడు చెప్పాడు కదా అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -