Monday, April 29, 2024
- Advertisement -

హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా ?

- Advertisement -

వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ఆదిత్య ఓం. అతని సరసన హీరోయిన్ గా అంకిత నటించింది. అయితే ఆదిత్య ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. హిందీలో చాలా సీరియల్స్ లో హీరోగా చేశాడు.

ఆదిత్య ని చూసి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు వైవిఎస్ చౌదరి. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ధనలక్ష్మి ఐ లవ్ యు్, భామా కలాపం, నిశ్శబ్దం, పొదరిల్లు, ప్రేమించుకుందాం,పెళ్ళికి రండి, గిలిగింతలు, మా ఆయన బంగారం, నీలవేణి వంటి సినిమాల్లో ఆదిత్య నటించాడు. అయితే వచ్చిన సినిమాలు అన్ని చేసి వరస ప్లాపులను చూశాడు.

దాంతో కెరీర్ ముగిసింది అనుకున్న సమయంలో దర్శకుడిగా మారాడు. బందూక్, ఫర్ మై మథర్, మిస్టర్ లోన్లీ – మిస్ లవ్ లీ వంటి సినిమాలను ఆదిత్య ఓం డైరెక్ట్ చేసాడు. అంతటితో ఆగకుండా నిర్మాత గా మారి.. క్షుద్ర, డోజాక్ వంటి మూవీస్ నిర్మించాడు. అలానే రైటర్ గా కూడా కొన్ని సినిమాలకు కథను అందించాడు. ఇంగ్లిష్ మూవీ డెడ్ ఎండ్ మూవీకి రైటర్ గా సేవలందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే నిర్మాతగా కోట్లు పోగొట్టుకున్నాడు. అయితే దామిని విల్లా, బండి వంటి సినిమాలను తెలుగులో నిర్మించడానికి సిద్ధం అయ్యాడు. పైగా సింగిల్ రోల్ ఉంటుందట. అలా సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీసి విజయం దక్కించుకోవాలని చూస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -