టాలీవుడ్‌లో టాప్ సింగర్‌లలో ఒకరైనా సునీత రెండో పెళ్లి చెసుకోబోతుందంటు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం వ్యాపారవేత్త రామ్ వీరప్పనేనితో సునీత నిశ్చితార్థం జరిగింది. తన ఇంట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాం జరిగినట్టు తేలుస్తుంది.
చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన సునీత 19 ఏళ్ల వయసులోనే మొదటి పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య-భర్తల మధ్య మనస్ఫర్థల కారణంగా సునీత తన భర్త నుండి విడాకులు తీసుకుని అతనికి దూరంగా ఉంటుంది. పిల్లలిద్దురు తన దగ్గరే పెరుగుతున్నారు.

అయితే రామ్ వీరప్పనేని ఎవ్వరో కాదు వాక్కెడౌట్(whackedout) మీడియా సమస్థ అదినేత. ’మాంగో’ యూట్యూబ్ ఛానల్స్ నడుపుతుంటారు. రామ్ వీరప్పనేనిది కూడా ఇది రెండో వివాహమేనని తెలుస్తోంది. టాలీవుడ్ సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషిస్తుంటాడు.
