Saturday, May 4, 2024
- Advertisement -

ఒక్క మామిడి పండు ధర రూ. 1000 .. అంత స్పెషల్​ ఏమిటీ అంటారా?

- Advertisement -

వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తుంటారు. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మామిడికి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు, కేసరి, సువర్ణరేఖ ఇటువంటి కొన్ని రకాలు మనకు తెలుసు. వీటి ధర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్​లో నూర్జహాన్​ అనే ఓ ప్రత్యేక మామిడిని పండిస్తారు. అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో ఈ పండును ఎక్కువగా పండిస్తారు.

ఈ పండు చాలా బరువు ఉంటుంది. సాధారణంగా మన దగ్గర దొరికే మామిడి పండ్లు ఒక్కటి 700 గ్రాముల వరకూ ఉంటుంది. వెయ్యి గ్రాముల పండు చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే నూర్జహాన్​ రకం మామిడి పండు ఒక్కోటి రెండు నుంచి మూడు కిలోలు ఉంటుంది. అంతే కాక చాలా తియ్యగా కూడా ఉంటుందని అక్కడి రైతులు చెబుతుంటారు. ఈ మామిడి పండ్లు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే సీజన్​ ప్రారంభం కాగానే వీటి బుకింగ్స్​ జరిగిపోతుంటాయి.

Also Read: మీకు తెలుసా.. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ ని వణికించిన ఉద్యమం మరొకటుందని..

ఇది చాలా అరుదైన మామిడి రకమని .. అప్ఘనిస్థాన్​ నుంచి ఇక్కడికి వచ్చిందని రైతులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ మామిడి పండుకు విపరీతమైన డిమాండ్​ పెరిగింది. ఒక్క మామిడి పండు రూ. 1000 కి అమ్ముతున్నారు. అది కూడా అడ్వాన్స్​ బుకింగ్​ చేసుకున్నవాళ్లకే. దీంతో ఈ మామిడి పండుకు ప్రత్యేకత ఏర్పడింది.

Also Read: మాస్కు పెట్టుకుంటే ఫైన్​.. ఇదెక్కడి విడ్దూరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -