Saturday, April 27, 2024
- Advertisement -

మ‌ధుమేహం ఉన్న‌వారు మామిడిపండ్ల‌ను తిన‌వ‌చ్చా …?

- Advertisement -

ఎండాకిలంవ‌చ్చిందంటే మామిడి సీజ‌న్… పండ్ల‌లో రాజు మామిడిపండు చూస్తే చిన్ని పెద్దాతేడీలేకుండా లొట్ట‌లేసుకుని తింటారు. పండ్ల‌లో చాలా ర‌కాలున్నాయి. కొన్ని తియ్య‌గా ఉంటే మ‌రికొన్ని పుల్ల‌గా ఉంటాయి. ఇంకొన్ని మామిడి ర‌కాల‌ను ప‌చ్చ‌ళ్ల‌కు వాడుతారు. తినే మామిడ పండ్ల విష‌యానికివ్తే పోష‌కాలు చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ప్ర‌ధానంగా విట‌మిన్ సి, ఎ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి.

ఈ క్ర‌మంలో మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు . కానీ డ‌యాబెటీస్ ఉన్న‌వారు మాత్రం జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. మ‌ధేమూహం ఉన్న‌వాల్లు పంప‌డ్ల‌ను తిన‌వ‌చ్చా అన్న సందేహాలు వ‌స్తాయి. ఇంత‌కీ అస‌లు డ‌యాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చాలేదా అన్న‌ది తెలుసుకుందాం.

Also Read: క్యాప్సికమ్‌ తో బరువు తగ్గడం ఈజీ..!

సాధార‌నంగా చిన్న‌సైజు మామిడి పండు ద్వారా ల‌భించే క్యాల‌రీలు… ఒక‌టిన్న‌ర గోధుమ రొట్టెతో ల‌భించే క్యాల‌రీల‌కు స‌మానం. క‌నుక మామిడి పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న వారు తిన‌వ‌చ్చు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే మాత్రం మామిడి పండ్ల‌ను తిన‌రాదు. ఎందుకంటే భోజ‌నం వ‌ల్ల అప్ప‌టికే రావ‌ల్సిన‌న్ని క్యాల‌రీలు మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో వెంట‌నే మామిడి పండును తింటే దాంతో ల‌భించే క్యాల‌రీలు అన్నీ కొవ్వు కింద మారుతాయి. దీనికి తోడు ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి. అయితే మ‌రి మామిడి పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న వారు తిన‌రాదా..? అంటే… తిన‌వ‌చ్చు. అందుకు ఓ ప‌ద్ధ‌తి ఉంది.

మ‌ధుమేహం ఉన్న‌వారు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలోగాని …. మ‌ధ్యాహ్నం లంచ్‌లోగాని .. రాత్రి డిన్న‌ర్ న‌డుమ ఉండే స‌మ‌యంలో మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అది కూడా స‌గం మామిడి పండును మాత్రమే తినాలి. దీంతో ఎలాంటి స‌మ‌స్యా రాదు. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. సాధార‌ణంగా మామిడి పండు గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువే. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారం మనం తిన్న త‌రువాత అది ర‌క్తంలో ఎంత‌సేప‌టికి గ్లూకోజ్‌గా మారుతుంది…..ఎంత సేప‌టికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను ప్ర‌భావితం చేస్తుంది అనే ఓ కొల‌త‌. ఇది మామిడి పండ్ల‌కు 100కు 56గా ఉంటుంది. అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ జాబితా ప్ర‌కారం చూస్తే ఇది చాలా త‌క్కువే. క‌నుక మ‌ధుమేహం ఉన్న వారు నిర్భ‌యంగా మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. పైన చెప్పిన విధంగా మామిడి పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

Also Read: ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -