Thursday, April 25, 2024
- Advertisement -

సింగర్‌ సునీత రెండో పెళ్లి .. నిశ్చితార్థం పూర్తి…!

- Advertisement -

టాలీవుడ్‌లో బ్యూటిఫుల్ సింగ‌ర్‌ల‌లో ఒక‌రైనా సునీత రెండో పెళ్లి చెసుకోబోతుందంటు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. తన ఇంట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాం జరిగినట్టు తేలుస్తుంది. అందుకు సంబందించిన పోటులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వ్యాపారవేత్త రామ్‌ వీరప్పనేనితో సునీత నిశ్చితార్థం ఈ రోజు ఉదయం జరిగింది. రామ్ వీరప్పనేనిది కూడా ఇది రెండో వివాహ‌మేన‌ని తెలుస్తోంది. సునీత‌కు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి అయింది. భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా సునీత త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకుని అత‌నికి దూరంగా ఉంటుంది.

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన సునీత.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. అంతేకాదు.. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగానూ వ్యవహరించారు. పాటలపోటీలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. సునీతకు ఇద్దరు పిల్లలున్నారు, వారిద్ద‌రు త‌న ద‌గ్గ‌రే పెరుగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -