Thursday, April 25, 2024
- Advertisement -

అంతరిక్షంలో క్రిస్మస్ బహుమతులు..!

- Advertisement -

అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళుతోంది స్పేస్​ఎక్స్​. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐసీఎస్​)లోని వ్యోమగాములకు క్రిస్మస్​ బహుమతులతో పాటు, పరిశోధన పరికరాలతో కూడిన సరికొత్త, అతిపెద్ద డబుల్​ డ్రాగన్​ నౌకను నింగిలోకి పంపింది. దీని ద్వారా తొలిసారి రెండు క్యాప్సు​ల్స్​ను ఒకేసమయంలో పంపించిన ఘనత సాధించింది.

నాసాకు చెందిన కెన్నెడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి స్పేస్​ ఎక్స్​ పాల్కన్​-9 రాకెట్​ ద్వారా ఈ కొత్త డ్రాగన్​ నౌకను అంతరిక్షంలోకి పంపారు శాస్త్రవేత్తలు. వ్యోమగాముల క్రిస్మస్ విందు కోసం కాల్చిన టర్కీ, కార్న్ బ్రెడ్ డ్రెస్సింగ్, క్రాన్బెర్రీ సాస్, షార్ట్ బ్రెడ్ కుకీలు, ఐసింగ్ గొట్టాలను తీసుకువెళుతోంది డ్రాగన్​. ఈ నౌక సోమవారం(నేడు) మధ్యాహ్నం ఐఎస్​ఎస్​కు చేరుకుంటుంది. నెలరోజుల పాటు అక్కడే ఉండనుంది.

డ్రాగన్​ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి సుమారు 6,400 పౌండ్లు (2,400కిలోలు) వస్తువులు పంపారు. అందులో బిలియన్ల కొద్ది సూక్ష్మజీవులు (మాక్రోబ్స్​), బయోమైనింగ్ అధ్యయనం కోసం పిండిచేసిన గ్రహశకల నమూనాలు, వ్యోమగాముల రాపిడ్​ బ్లడ్​ టెస్ట్​ కోసం కొత్త కిట్టు, కళ్లు, ఎముకులపై ప్రయోగాలు చేసేందుకు 40 ఎలుకలను ఇందులో పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -