Thursday, April 18, 2024
- Advertisement -

గాయని సునిత పెళ్లిడేట్ వచ్చేసింది!

- Advertisement -

ప్రముఖ సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది.  తన పెళ్లిపై వచ్చిన ఎన్నో పుకార్లకు సింగర్ సునీత ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే.

ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. జనవరి 9న సునీత, రామ్ ల వివాహం జరగనుంది. ఈ జంట సంక్రాంతికి ముందే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. జనవరి 9న వీరిద్దరి పేరుపై మంచి ముహుర్తం ఉండటంతో…మళ్లీ ఈ ముహుర్తం దాటితే మంచి రోజులు లేకపోవడంతో  అదే తేదీని ఫిక్స్‌ చేసేశారట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -