Monday, May 13, 2024
- Advertisement -

ఆగస్ట్ 22… 6 మెగా పండగలు!

- Advertisement -

ఆగస్ట్ 22. మెగా ఫ్యాన్స్ కు పెద్దపండగ.ఆ రోజు చిరు బర్త్ డే .అభిమానులు రకరకాల సేవా కార్యక్రమాల్లో మునిగిపోతారు.ఎవరికివారు తమకు తోచిన సేవనేదో చేస్తారు.ఇంతకాలం కేవలం అభిమానులు మాత్రమే చిరు బర్త్ డేకు సేవ చేసి థ్రిల్ చేస్తుంటే…

ఈసారి అలాంటి థ్రిల్ ను మెగా వారసులు కూడా షురూ చేయబోతున్నారు.బర్త్ డే వేదికపై ఏకంగా ఆరుగురు చిరు వారసులు….. నానా హంగామా సృష్టించడానికి రెడీ అవుతున్నారు.దీనికోసం స్కెచ్ వర్క్ పూర్తయిపోయింది. ఇక కేవలం అమలు చేయడమే తరువాయి.దాని కోసం ఎవరెవరు ఎలా ఇది చేయబోతోందనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

చిరంజీవి 150వ సినిమా అనౌన్స్ మెంట్ విషయంలో ఆయన బర్త్ డే పార్తీని భారీగా జరుపుతున్నప్పటికీ…. ఆరోజు ఆ మెగా హీరోల హంగామా పైనే మెయిన్ ఫోకస్ పడుతోంది.ఇదే వేదికపై సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం టీజర్ విడుదలకు నోచుకోబోతోంది.అలాగే వరుణ్ తేజ్ కంచె టీజర్ తో మనల్ని థ్రిల్ చేస్తానంటున్నాడు. అంటే కొత్తగా వచ్చిన వరుణ్ ,సాయిధరమ్ లు ముందుగా అక్కడ ఫోకస్ అవబోతున్నారన్నమాట.

ఇక మెగా కుటుంభం నుంచి వచ్చి పాతుకుపోయిన టాప్ హీరోల్లో…. పవన్ ,చెర్రీల గురించి డిస్కస్ చేసుకోవల్సి  ఉంటుంది.పవన్ అదే రోజు గబ్బర్ సింగ్ సీక్వెల్ అయినటువంటి సర్దార్ టైటిల్ కు సంబందంచిన మరో పోస్టర్ ను లాంచ్ చేస్తాడని చెబుతున్నారు. ఒక వేల అలాజరగని పక్షంలో గతంలో మహారాష్ట్ర్రలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ కు చెందిన సీన్ ను టీజర్ రూపంలో విడుదల చేస్తాడని అంటున్నారు.పవన్ నుంచి చెర్రీ మ్యాటర్ కొస్తే…శ్రీనువైట్ల చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ అదేరోజు ఉంటుందని తెలుస్తోంది.అంటే మెగా బర్త్ డే వేదికపై పవన్ ,చెర్రీల చిత్రం తాలూకు విశేషాలకు చోటు దక్కుతుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు మనం నలుగురి గురించి డిస్కస్ చేసుకున్నాం.ఇక మిగిలిన ఆ ఇద్దరు చిరంజీవి,అల్లు శిరీష్ .గౌరవంతో శిరీష్ గౌరవం పెంచలేకపోయినప్పటికీ….సురేష్ బాబు రానాతో చేయించినన్నిసార్లు సినిమాలు చేయించడానికి అల్లు అరవింద్….. అల్లు శిరీష్ విషయంలో డిసైడ్ అయిపోయాడని టాక్ . సో అదే రోజు అల్లు శిరీష్ తన కొత్త సినిమా ఓపెనింగ్ తో లేదా పోస్టర్ తో హల్చల్ చేయడానికి సమాయత్తమయ్యాడు.ఇక చిరు 150వ సినిమా ఓపెనింగ్ ను కచ్చతంగా అదే రోజు పూరితో ముహూర్తం షాట్ ను షూట్ చేయబోతున్నారు.ఇన్ని తతంగాలు ఒకే రోజు మెగా వేదికపై కనిపిస్తుంటే….ఇక మెగా అబిమానులను పట్టుకోగలమా చెప్పండి.మెగా ఫ్యాన్స్ ను  మాములుగానే కంట్రోల్ చేయడం కష్టం.అలాంటిది ఏకంగా వారి దృష్టిలో ఆరు పండగలు ఒకేసారి కళ్లకు కనిపిస్తుంటే … అది ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ కాకుండా మరేమౌతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -