Monday, May 6, 2024
- Advertisement -

వామ్మో..ఈ హీరోల సంపాదన నిజంగానే ఏడాదికి ఇన్ని కోట్లా!

- Advertisement -

సల్మాన్ ఖాన్ ఏడాది 214 కోట్ల రూపాయలు.. అమితాబ్ బచ్చన్ కూడా ఏడాదికి 214 కోట్ల రూపాయలు.. ఇంకా బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఏడాదికి 209 కోట్ల రూపాయలు.

సంపాదిస్తున్నారట. తాజాగా వెల్లడి అయిన నీల్సన్ సర్వే..

ఇతర వివరాలను ఆధారంగా చేసుకొని..హాలీవుడ్ బాలీవుడ్ హీరోల్లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనే జాబితాలో ఈ ఫిగర్లు నమోదయ్యాయి. ఏడాదికి ఈ హీరోలు ఇంతంత మొత్తాలను సంపాదిస్తున్నారట.

ఈ జాబితాలో తొలి స్థానాల్లో హాలీవుడ్ హీరోలే ఉన్నారు. నంబర్ వన్ ప్లేస్ లో రాబర్ట్ డౌనీ జూనియర్ అనే హీరో ఉండగా.. ఆ తర్వాత జాకీ చాన్ ఉన్నాడు. రాబర్ట్ డౌనీ తన సినిమాలతో. .వాణిజ్య ఒప్పందాలతో ఏడాదికి 511 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. జాకీ చాన్ సంపాదన ఏడాదికి 319 కోట్ల వరకూ ఉంది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ అమితాబ్ అంతర్జాతీయ స్థాయిలో సంయుక్తంగా 7 స్థానంలో నిలిచారు. వీరిద్దరూ ఏడాదికి చెరో 214 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని బోగట్టా.

ఇక మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సంపాదన ఏడాదికి 209 కోట్ల రూపాయలుగా ఉందట. ఈ డబ్బున్నంతా వీళ్లు సినిమాల ద్వారా.. రియాలిటీ షోల్లో పాల్గొంటూ.. తమకున్న ఎంటర్ టైన్ మెంట్ సంస్థల ద్వారా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. అయినా మరీ ఏడాదికి రెండువందల కోట్ల రూపాయల పై స్థాయిలో అంటే.. ఇది కళ్లు చెదిరే మొత్తమే అనుకోవాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -