ముద్దుగుమ్మల ముచ్చట్లు ఎప్పుడు గమ్మత్తుగానే ఉంటాయి. రకరకాల కబుర్లతో డైలీ వీళ్ళు చేసే హడావిడి సినీ లవర్స్‌కు ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటాయి.
అలానే ఇవాళ కూడా పరెఫెక్ట్ ఫిగర్, క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోయే ఒంపుసొంపులు, లవ్ స్టోరీలకు బొద్దుగా, ఎమోషన్స్‌కు సన్నగా, ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ తనదైన అందంతో, తనదైన శైలిలో ముద్దుగుమ్మ అనుష్క రాణించేసింది. ఇప్పుడు ఆర్య, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రంలో లావుగా ఉన్న అనుష్క సన్నబడటానికి ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్న హీరో ఆర్య దగ్గర జిమ్‌లో జాయిన్ అవుతుందట.
అక్కడ వచ్చే రొమాంటిక్ సీన్లో అనుష్క ఆర్యకు లిప్‌కిస్ ఇస్తుందట. ఇద్దరి మద్య ఈ సీన్లో కెమిస్రీ బాగా పడిందని సినీ వర్గాల టాక్. మామూలుగానే బిరియాణీలతో హీరో ఆర్య హీరోయిన్స్‌ని వలలో పడేసుకుంటాడని టాక్. అలాంటిది హీరోయిన్ అనుష్కను లిప్‌లాక్ సీన్ వరకు తెచ్చాడంటే బిరియానీలే పెట్టాడో లేక ఇంకేమి ఇచ్చాడో అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబందించి ఒక పోస్టర్‌ను వదిలారు. ఆ పోస్టర్‌కి అనుష్క మీద అందరూ సెటైర్లు వేశారు. ఇండస్ట్రీలో కొంతమంది నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. హీరోయిన్ సమంత ఏకంగా తన ట్విట్టర్ లో అక్కా అని సంబోదించింది. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ తాజాగా అనుష్క పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ ఈ పోస్టర్లో మరీ ఎక్కువగా లావు అయిపోయింది. మరి ఈ పిక్‌ను చూసిన అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
