Friday, May 10, 2024
- Advertisement -

కావాలని ఆ హీరోయిన్ ను దూరం పెడుతున్న సల్మాన్!

- Advertisement -

కత్రినాకైఫ్ ను కావాలని దూరం పెడుతున్నాడట సల్మాన్ ఖాన్. ఒకప్పుడు తన ప్రియురాలిగా ఉండిన ఆమెను అతడు దూరం పెట్టేస్తున్నాడు. ఆమెతో నటించడానికి కూడా అతడు ఇష్టపడటం లేదు. ఈ ప్రతిపాదనను తెచ్చిన దర్శక, నిర్మాతలను వారించి మరీ కత్రినాకు దూరంగా ఉంటున్నాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి సల్మాన్ ఎందుకు కత్రినను దూరం పెడుతున్నాడు అంటే దాని వెనుక ఆసక్తికరమైన ప్రచారం ఉంది.

కత్రినా అంటే సల్మాన్ కు ఎలాంటి కోపం లేదట. ఆమె తన మాజీ ప్రియురాలు… తనకు దూరం అయ్యిందనే ఆగ్రహాలేమీ లేవు. ఆమె పట్ల సల్లూ సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. ఇటీవల జరిగిన సల్మాన్ చెల్లెలు పెళ్లి వంటి కార్యక్రమాలకు కూడా కత్రినా హాజరైంది. అలా సల్లూతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే సినిమాలో మాత్రం కత్రినా వద్దు అని సల్మాన్ స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎందుకలా.. అంటే సినిమా అంటే కొన్ని నెలల పాటు ఆమె తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆమెకు ఎక్కడ తను మళ్లీ దగ్గరవుతానో అనేది సల్మాన్ భయంగా తెలుస్తోంది. ఎంతైనా మాజీ ప్రియురాలు కదా.. ఇప్పుడు మళ్లీ ఆమె కు దగ్గర అయితే బాగుండదనేది సల్మాన్ భయం. ఇక కత్రినా కూడా ఇప్పుడు రణ్ బీర్ తో బిజీగా ఉంది. వారు పెళ్లి చేసుకొనే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ కత్రినాను తనకు దగ్గర చేయవద్దని సల్మాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆమెను దూరం పెడుతున్నాడట! అదీ కథ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -