Wednesday, May 8, 2024
- Advertisement -

నవ్వినా నొప్పి వచ్చేది – సోనాలి బింద్రే

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే గ‌త కొంతకాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డ‌తున్న సంగ‌తి తెలిసింది.ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటుంది సోనాలి. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ తెలిపారు. అయితే ఆమె ఎదుర్కొంటున్న చికిత్సా విధానం, తను నొప్పిని భరిస్తున్న తీరును ట్విట్టర్ ద్వారా అభిమానులతో సోనాలి షేర్ చేసుకున్నారు. ‘గత కొన్ని నెలలుగా నాకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయాను. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి కూడా శక్తిలేక బాధపడ్డాను. శారీరకంగా ప్రారంభమైన ఈ నొప్పి.. మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది.

కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. కొన్నిసార్లు కేన్సర్‌ నా నుంచి మొత్తం తీసేసుకుంటున్న భావన కలుగుతోంది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా. ఇలాంటి చెడు రోజులు జీవితంలో కచ్చితంగా వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి అంటూ ట్విట్ చేసింది సోనాలి.ఆమె ప‌రిస్థితి చూసిన వారంద‌రు పాపం సోనాలి,ఆమె పూర్తిగా కోలుకుని ఆరోగ్యంతో తిరిగి రావ‌ల‌ని నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -