Monday, May 6, 2024
- Advertisement -

నిన్ను చంపేస్తాం.. సోనూ నిగమ్‌కు బెదిరింపులు

- Advertisement -

బెదిరింపులు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారితో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు త‌ర‌చుగా వ‌స్తుంటాయి. ఇటీవ‌ల ప‌ద్మావ‌త్ సినిమాకు బ‌హిరంగ బెదిరింపులు, హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ను చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాదాపు ఏడాది నుంచి వివాదాస్ప‌ద ట్వీట్లు, వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో సోను నిగ‌మ‌న్‌ను కొంద‌రు టార్గెట్ చేసుకున్నారు.
ఆ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతూ ప‌లువురు ఆయ‌న్నుచంపేస్తాం అని బెదిరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముంబాయిలోని అత‌డి ఇంటికి భారీ భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇంత‌కుముందు సోను నిగ‌మ్‌ను గుండు గీయిస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇవి:
– ఆజాన్ (ముస్లిం సైర‌న్‌) పిలుపుతో తనకు చిరాకుగా ఉందంటూ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దాంతో ఆయనకు గుండు చేయించి ఊరేగించాలంటూ ఓ ముస్లిం మత పెద్ద ఫత్వా జారీ చేశారు. ఆ తరువాత సోనూ నిజంగానే గుండు చేయించుకుని క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశం.వీటి నేప‌థ్యం ట్విటర్‌లో తాను ఎదుర్కొంటున్న కామెంట్లు భరించలేక మాధ్యమం నుంచి తప్పుకుంటున్నట్లు సోనూ బ‌య‌ట‌కువ‌చ్చాడు.

– ఆ త‌ర్వాత ఇటీవల థియేటర్లలో జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న‌ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సోనూ నిగ‌మ్ జాతీయ గీతం ప్రసారం చేయడం తనకూ ఇష్టం లేదని ప్ర‌క‌టించాడు. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొంద‌రు సోనూను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సోను నిగ‌మ్ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్ కాగా తెలుగులో కూడా క‌నిపించాడు. ‘సూపర్‌’, ‘చింతకాయల రవి’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ త‌దిత‌ర సినిమాల్లో పాటలు పాడాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -