తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఇది రెండో పెళ్లి. గతంలో ఆమెకు పెళ్లి అయింది. మొదట భర్త అశ్విన్‌తో విభేదాలు రావడంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. వ్యాపారవేత్త విషాగన్‌తో గత కొంతకాలంగా సన్నిహిత్యంగా ఉంటుంది సౌందర్య. ఇది ప్రేమగా మారడంతో వీరు పెళ్లి చేసుకున్నారు. తమిళ సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తరువాత ఈ జంట హానీమూన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కొత్త జంట హానీమూన్ ఐస్ ల్యాండ్‌కు వెళ్లింది.
అక్కడ వీరిద్దరు దిగిన కొన్ని ఫోటోలను మీడియాలో షేర్ చేసింది సౌందర్య. వారు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సౌందర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని సౌందర్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక పక్క ఉగ్రవాదుల దాడిలో జవాన్లు మరణిస్తే, సౌందర్య ఇలా హానీమూన్ ఫోటోలు పోస్ట్ చేయడంపై వారు మండిపడుతున్నారు. మీరు హనీమూన్ చేసుకోవడం అది మీ వ్యక్తిగతం కాని ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టడం ఏంటీ మీ మైండ్ ఏమైనా చెడిందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
- Advertisement -
రెండో భర్తతో హానీమూన్..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -