హనీమూన్ ప్లాన్ గురించి చెప్పిన సింగర్ సునిత!

- Advertisement -

టాలీవుడ్ లో సింగర్ సునిత ఎంత ఫేమస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సింగర్ గానే కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో ఆమె హూస్ట్ గా వ్యవహరించారు. పలు రియాల్టీ షో ల్లో జడ్జీగా వ్యవహరించారు. వివాహం జరిగిన కొన్నాళ్లకు సునిత భర్తతో బేదాభిప్రయాల వల్ల విడిపోయారు. ఈ క్రమంలోనే ఆమె ద్వితీయ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా నోరు మెదపని సునీత తాను చేసుకున్న రామ్ వీరపనేనితో ఎలా పరిచయం అయిందో గుట్టు విప్పింది.

తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చిన సునీత నూతన జీవితం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది. కొంత కాలంగా రామ్ తో తనకు మంచి పరిచయం ఉందని.. ఈ పరిచయమే పెళ్లి చేసుకోవడానికి కారణం అన్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పాం. వారి అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నాం.

- Advertisement -

నా పిల్లలు కూడా పరిస్థితులని అర్ధం చేసుకొని రెండో పెళ్ళికి ఓకే చెప్పారని వివరించింది. కరోనా వలన అందరిని పిలవలేకపోయాం.. రిసెప్షన్ లాంటి కార్యక్రమాలు కాకుండా సన్నిహితులకు చిన్న చిన్న పార్టీలు ఇచ్చి ఆ తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకుంటాం అని సునీత పేర్కొంది. 

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...