Friday, March 29, 2024
- Advertisement -

ఆ హీరోకి ఈసారి కూడా కలిసొచ్చింది

- Advertisement -

శ్రీ విష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో నారా రోహిత్ కంటే మంచి పేరు తెచ్చుకున్న నటుడు. ఇతగాడు తాజాగా చేసిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. హీరో ఈసినిమాలో రామ్ అయినప్పటికీ… శ్రీవిష్ణు నటనకు గుర్తింపు లభించింది. కథ అంతా రామ్ చుట్టూనే తిరిగినా…ఇతనికిచ్చిన పాత్ర వరకు ఇతను సెట్ అయిపోయాడు. బేసికల్లీ ఇతని గొంతు ఆయా పాత్రకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. రామ్ తో పాటు ఫుల్ లెన్త్ ఉండే వాసు పాత్రలో ఇతను ఇమిడిపోయాడు. అభి పాత్ర చేసిన రామ్ తన ఫ్రెండే.

అయినప్పటికీ…. అతను తన మావయ్య కూతురును మహాను లవ్ చేస్తున్నాడని తెలియకుండా..ఇన్నోసెన్సీతో అతను పలికించిన హావ భావాలు వర్కవుట్ అయ్యాయి. మెంటల్ మదిలో చిత్రం కూడా వర్కవుట్ కాకపోయినా.. పర్వాలేదనిపించింది. బట్ ఓ సాలిడ్ హిట్ పడితే గాని మనోడు మాంచి హీరో పొజిషన్ కు రాలేడనే విషయం అర్ధమవుతుంది. కాని అలాంటి హిట్లు పడాలంటే… దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇతను ఓ సినిమా చేయాలి. కాని అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. దానికి కారణం… ఇతగాడు నారా రోహిత్ టీమ్ తోనే జర్నీ చేస్తున్నాడు. వారి ప్రొడక్షన్ వ్యవహారాల్లోనే తల మునకలై ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -