కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా రోబో 2.0. ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా ప్రత్యేకలు ఉన్నాయి. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉందట.
అసలు మూడు పాటలు కంపోజ్ చేసినప్పటికీ సినిమాలో మాత్రం ఒక్క పాటే ఉంటుందని… మిగతా రెండు పాటలను తాను 2 0 ఆడియో వేదిక మీద లైవ్ పెరఫార్మెన్స్ ఇవ్వబోతుననట్లుగా తెలిపారు. మరి దర్శకుడు శంకర్ ఈ ఒక్క పాట కోసమే దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టాడా.. అలాగే ఈ ఒక్క పాట విడుదల కార్యక్రమాన్ని వేదికగా.. దుబాయ్‌ని ఎంచుకున్నారు. అలానే ఈ వేడుకకి 12 కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం ఈ మూవీ పబ్లిసిటీ ఒక రేంజ్ లో ఉండని చెప్పొచ్చు. కేవలం ఒక్క పాట విడుదల కోసం ఈ లెవల్లో 12 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడు అంటే శంకర్ మామూలోడు కాదు.
ఇక మరో వైపు 2.0 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి అన్ని భారీగానే ఉన్నాయి. పబ్లిసిట్ కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ రోజు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అంగరంగ వైభవంగా జరగనుంది. తెలుగునాట ఈ సినిమా 81కోట్లకు హక్కులు అమ్ముడుపోయిందని తెలుస్తోంది.
