Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వెళ్లిపోతానంటూ బెదిరించిన హౌస్‌మెట్‌

- Advertisement -

బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఇచ్చిన టాస్క్ పూర్తి చేయ‌క‌పోవ‌డంతో హౌస్‌మెట్స్ హౌస్‌మెట్స్‌కు అతని మ‌ధ్య చిన‌పాటి వివాదం మొద‌లైంది.దీంతో అత‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతాన‌ని చెప్ప‌డంతో అంద‌రు షాక్ గురూయ్యారు.ఇది జ‌రిగింది తెలుగు బిగ్‌బాస్‌లో కాదులేండి.హిందీ బిగ్‌బాస్ ప్ర‌స్తుతం 12 సీజ‌న్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే.12 సీజ‌న్ మొద‌లై ఇంకా రెండు రోజులు కూడా కాలేదు,అప్పుడే హౌస్‌మెట్స్ మ‌ధ్య వివాదాలు మొద‌లైయ్యాయి.బిగ్‌బాస్ 12వ సీజ‌న్‌లో క్రికెట‌ర్ శ్రీశాంత్ కంటెస్ట్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. గేమ్‌లో భాగంగా శ్రీశాంత్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.

అయితే దానిపై ఆసక్తి చూపని అతడు టాస్క్ పూర్తి చేయడానికి నిరాకరించాడు.హౌస్‌మెట్స్ ఎంత చెప్పిన విన‌ని శ్రీశాంత్‌,బిగ్‌బాస్‌ వార్నింగ్ ఇచ్చినా శ్రీశాంత్ మాత్రం టాస్క్ పూర్తి చేయలేదు. దీంతో బిగ్‌బాస్ ఆ టాస్క్‌ని రద్దు చేశాడు.దీంతో మిగిలిన హౌస్‌మెట్స్ అంద‌రు శ్రీశాంత్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.అతనితో గొడవకి దిగారు. దీంతో అలిగిన శ్రీశాంత్ ఇలా అయితే హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరించాడు.గేమ్ లో ఇలాంటి టాస్క్‌లే ఉంటాయంటే మాత్రం తను ఎక్కువ రోజులు ఈ షోలో కంటిన్యూ అవ్వలేనని అన్నాడు. మ‌రి దీనిపై హోస్ట్ సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -