Saturday, April 20, 2024
- Advertisement -

న‌టుడు ఆత్మ‌హ‌త్య‌…షాక్‌లో టాలీవుడ్!

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీని వ‌ర‌స సంఘ‌ట‌న‌లు అత‌లాకుత‌లం చేస్తున్నాయి.తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ అర్జున్ గౌడ్(30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.అర్జున్ గౌడ్ కొన్ని సినిమాల‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేశాడు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో మంగా టిఫిన్ సెంటర్ ఎదురుగా హృదయ లాడ్జిలో గత ఇరవై రోజులుగా ఉంటోన్న అర్జున్ గౌడ్ ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకొని లాడ్జికి చేరుకున్నాడు. షూటింగ్ ముగించుకొని వచ్చిన అతడు కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు.

అతడితో పాటు లాడ్జిలో ఉన్న తన స్నేహితుడు నాగకార్తిక్ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావని ప్రశ్నించగా.. దగ్గు వస్తుందని చెప్పి టాబ్లెట్లు వేసుకొని పడుకున్న అర్జున్ గౌడ్ తెల్లవారుజామున ఎంత సమయమవుతున్నా నిద్ర లేకపోవడంతో నాగకార్తిక్ అతడిని నిద్రలేపే ప్రయత్నం చేశాడు.చలనం లేకుండా ఉండడంతో వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతడు చనిపోయినట్లు నిర్ధారించడంతో నాగకార్తిక్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చెపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -