Tuesday, May 14, 2024
- Advertisement -

ర‌కుల్‌కు మ‌రో సారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

- Advertisement -

గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ నటి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అంతే ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

కొద్దిరోజుల క్రితం కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే… నిరాహారదీక్ష చేస్తాఅంటూ చెప్పిన సంగ‌తి తెలిసిందే. స్పందించ‌కుంటే పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతాని చెప్పిన విధంగానే ఫిల్మ్ చాంబ‌ర్‌ముందు ఆర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసి హ‌ల్ చ‌ల్ చేసంది.

కుల్ ప్రీత్ సింగ్ అసలు కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏవి పరిశ్రమలో లేవని ఇవన్ని వట్టి గాలి వార్తలే అని కొట్టిపారేసిన విషయాన్ని గుర్తు చేయగా శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. కోట్లు కోట్లు సంపాదిస్తూ జిమ్ములు – పబ్బులు – రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళకు తనలాంటి వాళ్ళ కష్టాలు కనిపించవని దెప్పి పొడిచింది.

ఇంకోసారి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ఉద్యమం గురించి చులకనగా మాట్లాడితే రకుల్ పళ్ళు రాలగొట్టి కట్టుడు పళ్ళ కోసం ముంబై పరిగెత్తేలా చేస్తానని నేరుగా వార్నింగ్ ఇవ్వడం అక్కడున్న వాళ్ళను విస్తుపోయేలా చేసింది.

మరో రెండు రోజుల్లో తన సభ్యత్వం గురించి స్పందన రాకపోతే ఎవరూ ఊహించని చర్యకు పాల్పడతానని చెబుతున్న శ్రీరెడ్డి అదేంటి అనేది మాత్రం గుట్టు విప్పలేదు. తన దగ్గర వీడియోలు – పెద్ద వాళ్ళ గురించి సాక్ష్యాలు ఉన్నాయని కేవలం ఇండస్ట్రీ మీద గౌరవంతో బయట పెట్టడం లేదని చెబుతున్న శ్రీరెడ్డి రెండు మూడు రోజుల తర్వాత ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపైన మా అసోషియేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక వేల స్పందింక‌పోతే ఎవ‌రి వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని సినీ ప్ర‌ముఖులు బెంబేలెత్తిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -