Sunday, May 5, 2024
- Advertisement -

రాజకీయాల్లోనూ రాటుదేలిపోయిన జగన్…… బాబు అండ్ కో బెంబేలు

- Advertisement -

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను ఎదుర్కోలేకపోయాడు జగన్. అలాగే అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కాలని ఆశించలేదు. ఆ రెండే చంద్రబాబుకు వరాలయ్యాయి. కెసీఆర్‌తో కుమ్మక్కయిన జగన్, సోనియాతో కుమ్మక్కయిన జగన్ అంటూ ఇష్టారీతిన ప్రచారం చేశారు. ఇక నాలుకకు అడ్డూ అదుపు లేకుండా అబద్ధపు హామీల వర్షం కురిపించాడు. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అయితే ప్రజల దృష్టిలో మాత్రం మోసాలు, అబద్ధాలు చెప్పే నాయకుడిగా నిలిచిపోయాడు చంద్రబాబు. సిఎం కుర్చీపైన జగన్‌కి ఆశ అని పచ్చ మీడియా ఎంత ప్రాపగాండా చేసినప్పటికీ అధికారం కోసం అడ్డదార్లు తొక్కలేదు జగన్.

అదే ఇప్పుడు జగన్‌కి చాలా కలిసొచ్చింది. వైఫల్యం జగన్‌కి చాలానే నేర్పించింది. ఇప్పుడు కూడా చంద్రబాబు…ఆయన భజన మీడియా బిజెపితో జగన్ కుమ్మక్కు విష ప్రచారం చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అస్సలు నమ్మని పరిస్థితి. అన్నింటికీ మించి విజయసాయితో కలిసి జగన్ రచిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ కూడా చంద్రబాబును బెంబేలెత్తిస్తున్నాయి. విజయ్ మాల్యాను చంద్రబాబు కలిశాడు అని విజయసాయి చెప్పినతర్వాత గట్టిగా ఖండించలేని పరిస్థితి చంద్రబాబుది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో విజయసాయి వ్యూహాల ముందు బాబు అండ్ కో అడ్డంగా బుక్కవుతూ వస్తున్నారు.

ఇప్పుడిక రైట్ టైంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మను కూడా రంగంలోకి దించాడు జగన్. ప్రజా సంకల్పయాత్రతో రోజు రోజుకూ జగన్ ప్రజాభిమానాన్ని పెంచుకుంటూ ఉండడం…….bవిజయసాయి రాజకీయ వ్యూహాలతోనే తలబొప్పి కట్టినట్టుగా ఫీల్ అవుతున్నాడు చంద్రబాబు. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను కదిలించే స్థాయిలో…… మహిళాభిమానం వైకాపా వైపు టర్న్ అయ్యేలా చేయడంలో, వైఎస్ అభిమానులను ఇంకా యాక్టివేట్ చేయడానికి వైఎస్ విజయమ్మ కూడా రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టిందంటే మాత్రం చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయం.

ఇప్పటికే విలువలు, విశ్వసనీయత విషయంలో నారావారి కంటే వైఎస్‌లు ఎన్నో మెట్లు పైన ఉన్నారు. ఇప్పుడిక జగన్, విజయసాయి, విజయమ్మల బృందం అంతా కలిసి బాబు ప్రచార పటాటోపాలు, నాటకాలను ఎండగడుతూ 2019లో అధికారంలోకి వస్తే వైకాపా ఏం చేస్తుంది? జగన్ ఎంత అభివృద్ధి చేస్తాడు? అనే విషయాల్లో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఇంకా ఎక్కువ స్థాయికి పెంచగలిగారంటే మాత్రం విజయసాయి చెప్పినట్టుగా 2019 ఎన్నికల వార్ పూర్తిగా ఒన్ సైడ్ అయినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తానికి ఒక్క పరాజయం జగన్‌కి గట్టి పాఠాలనే నేర్పింది. అటు పాలన పరంగా ప్రత్యేక హోదా, పోలవరంలాంటి విషయాల్లో చంద్రబాబు కంటే జగనే గొప్పగా ఆలోచించాడని ప్రజలు నమ్ముతున్నారు. ఇక బాబు రుణమాఫీ హామీలు అమలు సాధ్యం కాదని 2014ఎన్నికలకు ముందే జగన్ చెప్పాడు. అన్నీ చేస్తానన్న చంద్రబాబు పూర్తిగా చతికిలపడ్డ నిజం కంటికి కనిపిస్తూనే ఉంది. ఇక రాజకీయ వ్యూహాల విషయంలో కూడా చంద్రబాబు కంటే జగన్‌దే పైచేయిగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన రాజకీయ వ్యూహాల విషయంలో జగన్‌ని అనుసరించాల్సిన దుస్థితి అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబుది. అటు పాలనా పరంగా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం పరంగా, రాజకీయ వ్యూహాల పరంగా కూడా జగన్‌లో అత్యున్నత స్థాయి పరిణతి కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే స్థాయిలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే మాత్రం ఇప్పటికే చాలా సర్వేలు తేల్చేసినట్టుగా 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపును అడ్డుకోవడం మాత్రం ఈ సారి చంద్రబాబుకు అసాధ్యంలానే కనిపిస్తోందని జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా విశ్లేషిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -