Monday, May 27, 2024
- Advertisement -

కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అప్పారావు అవుట్‌..

- Advertisement -

శ్రీరెడ్డి దెబ్బ‌కు నిర్మాత & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుకు మైండ్ బ్లాక్ అయ్యింది. అప్పారావు ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడని , చిరంజీవి పేరు చెప్పి మైనర్ బాలికలను కూడా వదిలిపెట్టలేదని నటి శ్రీ రెడ్డి సంచలన నిజాలు బయట పెట్టిన సంగతి తెల్సిందే. అంతే కాదు ఇలాంటి వారు మీ పక్కన ఉన్న కానీ మీకు చెడ్డ పేరు వస్తుందని చిరంజీవి ని ట్యాగ్ చేసి చెప్పడం తో తాజాగా వాకాడ అప్పారావు ను కొణెదల ప్రొడక్షన్ హౌస్ నుండి బయటకు పంపినట్లు తెలుస్తుంది.

చిరంజీవి గారూ ! మీ ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే వాకాడ అప్పారావు గారి విషయం కాస్త పట్టించుకొంటారా ? అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే అతని నిజ స్వరూపం ఇదే ‘ అంటూ శ్రీరెడ్డి తన ట్వీట్స్ లో ‘ బాంబు ‘ పేల్చింది.

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ ఖైదీ నెం.150 ‘ చిత్రంలో అవకాశాలు ఇప్పిస్తానని, అయితే ఇందుకు తనతో ‘ సహకరించాలని ‘ పలువురు జూనియర్ ఆర్టిస్టు లను వాకాడ ప్రలోభపెట్టాడని ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించినప్పటికీ.. ఈ ఆరోపణల విషయాన్ని తమ సంస్థ సీరియస్ గా పరిగణించిందని కొణిదెల ప్రొడక్షన్స్ సీఈవో తెలిపారు. ఈ అంశాన్ని ‘మా ‘ లోని ‘ క్యాష్ కమిటీ ‘ కి నివేదించామన్నారు. విచారణ తరువాత వాకాడపై చర్య తీసుకుంటామన్నారు. కాగా.. ఇదే విషయాన్ని వాకాడ ధృవీకరిస్తూ.. ఈ కంపెనీ నుంచి తాను వైదొలగినట్టు చెప్పాడు. చిరంజీవి కూడా విషయం తెలుకొని సీరియస్ అయినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -