Wednesday, May 1, 2024
- Advertisement -

వెన‌క్కి త‌గ్గేదిలేదు… ఆధారాల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌దులుతా..

- Advertisement -

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు అందుకున్న శ్రీరెడ్డి ప‌వ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌ల‌పాల‌య్యింది. ఈ జీవితం ఇక చాలు! ఫస్ట్‌టైమ్‌ ఒంటరినయ్యాను.. అందరికీ ధన్యవాదాలు’ అంటూ వైరాగ్య వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మ‌రో సారి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష మ‌య్యారు.

తాజాగా సీనియర్‌ నటులు జీవితా రాజశేఖర్‌ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. అతిత్వరలోనే అందరి బండారం బయటపెడతానని రాసుకొచ్చారు. వెనుకడుగు వేసే పరిస్థితి లేదిప్పుడు. నా పోరాటం కొనసాగుతుంది. చావో రేవో ఏదో ఒకటి తేల్చుకునేదాకా ఆగను. ఇకముందు ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటాను. నా జీవిత చరిత్రను చెప్పేస్తాను. నాదేకాదు సంబంధిత వ్యక్తులందరి చరిత్రలూ బయటపెడతానంటూ హెచ్చ‌రించింది.

ఏ అంశమైనా చట్టపరంగా ముందుకు వెళ్లాలన్న పవన్‌ కల్యాణ్‌గారి సూచనను స్వీకరిస్తున్నాను. నా దగ్గరున్న ఆధారాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాను. న్యాయపోరాటంలో భాగంగా అందరికంటే ముందు జీవితా రాజశేఖర్‌తో తలపడతాను. ఆధారాలను ఒక్కొక్కటిగా వదులుతాను’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.ఈ వివాదానికి ఇప్ప‌టితో పుల్‌స్టాప్ ప‌డ‌టం క‌నిపించ‌డంలేదు.

https://www.facebook.com/iamsrireddy/posts/2094149114165343

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -