Saturday, May 18, 2024
- Advertisement -

అన్నీ ఎన్నికల ఏడాది డ్రామాలే… 2019 తర్వాతా బిజెపితోనే టిడిపి పొత్తు

- Advertisement -

పిక్చర్ క్లియర్. సినిమా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆంద్రప్రదేశ్ ప్రజల్లో మోడీ, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ప్రజాగ్రహంలో బాబు కూడా కొట్టుకుని పోవడం ఖాయమని చంద్రబాబుకు ఆయన ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చిచెప్పాయి. ఆ దెబ్బతో అధికారమే పరమావధిగా ఆలోచించే చంద్రబాబు రాజకీయ వ్యూహం పన్నాడు. వ్యతిరేకత మొత్తం మోడీపైకి నెట్టేశాడు.

ఇప్పుడిక దేశం మొత్తం మీద కూడా అసలు సిసలైన కరడుగట్టిన మోడీ వ్యతిరేకిని నేనే అని బిల్డప్ ఇస్తున్నాడు. అయితే ఆ బిల్డప్పుల వెనుక అసలు రహస్యాన్ని టిడిపి ఎంపి జేసీ దివాకరరెడ్డి తాజాగా బాయటపెట్టాడు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలను నిజాయితీగా బయటపెట్టడంలో జేసీది అందెవేసిన చేయి మరి. ఆ మధ్య ప్రత్యేక హోదా ఉద్యమం, పోరాటం అని చంద్రబాబు అన్నప్పుడు కూడా …..పోరాటమా..వంకాయా….బాబుకు హోదా తెచ్చే సీన్ లేదు…..హోదా వచ్చే అవకాశమే లేదు అని కుండబద్ధలు కొట్టిన నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డి. ఇప్పుడు మరోసారి అలాంటి బాంబు లాంటి డైలాగ్ పేల్చాడు జేసీ. 2019 ఎన్నికల తర్వాత కూడా లోక్‌సభలో ఎక్కువ స్థానాలు గెల్చుకున్న పార్టీగా బిజెపినే నిలుస్తుందని…..2019 ఎన్నికలయిన తర్వాత మరోసారి బిజెపితో టిడిపి పొత్తుపెట్టుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర అవసరాల కోసం, ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు పెట్టుకుంటే తప్పేముందని కూడా జర్నలిస్టులతో జేసీ దబాయించడం గమనార్హం. జేసీ మాటలు విన్న జర్నలిస్టులకు మాత్రం సినిమా చాలా స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అథోగతి పాలయ్యే దిశగా సాగుతూ ఉంటేనేం కానీ …చంద్రబాబు రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం ….వాట్ ఏ రాజకీయం సామీ అని ఆశ్ఛర్యపోతూ ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -