Thursday, March 28, 2024
- Advertisement -

అక్కినేని కోడలుపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్

- Advertisement -

శ్రీరెడ్డి… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. సినీ నటిగా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలో ఫేమస్ అయిపోయిందీ బ్యూటీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. గొడవలకు దిగే తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు, సినీ, రాజకీయ ప్రముఖులపై విమర్శనాత్మక బాణాలు సంధిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఏ చిన్న సందర్భం దొరికినా సెలబ్రిటీలపై విరుచుకుపడటం శ్రీరెడ్డికి అలవాటుగా మారింది. ఇటీవల మెగా డాటర్ నిహారిక పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. తాజాగా అక్కినేని కోడలు సమంత డ్రెసింగ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఫ్యాన్‌గా నీ డ్రెసింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదంటూ సమంతపై ఫైర్ అయింది.

‘సమంతా.. ఏంటి ఆ డ్రెస్సులు బీభత్సంగా..! అక్కినేని ఫ్యామిలీలో అమలా గారు ఎంత మంచిగా డ్రెస్‌లు వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెను చూస్తే చాలా యంగ్‌గా అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. పశువుల మీద ప్రేమతో సంస్థను ప్రారంభించడం, పిల్లలను పెంచడం ఎన్నో మంచి పనులు చేస్తుంటుంది. ఇక నాగార్జున నాకు ఎలాగూ నచ్చరు. అది వేరే విషయం. కానీ ఓ ఫ్యాన్‌గా నీ డ్రెసింగ్ సెన్స్ నాకు నచ్చడం. నమ్రతను చూడండి మహేష్ బాబుకు ఎంత సపోర్ట్‌గా ఉంటుందో!. మహేష్ బాబు ఇంత సక్సెస్‌గా ఎదగడానికి కారణం నమ్రత శిరోద్కర్.

నాగ చైతన్యకు మూవీ ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేవు.. అంత క్రేజ్ లేదు. నువ్వు కూడా అతని కెరీర్ చూసుకోవచ్చు కదా. బట్టలిప్పుకుని ఈ రచ్చ ఎందుకు? పోనీ అవేమైనా నీకు సూట్ అయ్యాయా అంటే అది లేదు. నువ్ సెక్సీ కాదు సమంత.. నువ్ నీ అందాలన్నీ బయటపెట్టినా పెద్దగా ఉపయోగం లేదు.క్యూట్‌నెస్ ఉంది నీకు కానీ హాట్‌నెస్ లేదు. దయచేసి ఈ బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకు. నువ్వు తమిళ్ అమ్మాయివి.. కానీ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్. పెళ్లయ్యాక లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్. అభిమానులుగా మాకది నచ్చడం లేదు. నాగ చైతన్య లైఫ్ మీద, సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టండి’అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

గతంలో కూడా సమంత బికినీ లుక్‌పై శ్రీరెడ్డి సంచల వ్యాఖ్యలు చేసింది. బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ పోస్ట్ చేస్తూ సమంత తన ఫొటోలతో వ్యాపారం చేస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

https://youtu.be/mfjSDCH2OW0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -