నటి శ్రీరెడ్డి హీరో నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఇప్పటికే నాని.. శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. కాగా.. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు.‘నాని నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అంత మాత్రాన నేను అతడిని సమర్థించను. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా ఉన్నాయి.నాని గురించి తెలిసిన వారికి అతను మహిళల పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో తెలుసు.
ఒకవేళ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కేవలం పేర్లు బయటపెడితే సరిపోదు. ఆధారాలు చూపించాలి. పోనుపోనూ ఆమె నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాలి. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సరైన చట్టాల్లేవు.ప్రముఖులపై ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు’ అని విశాల్ అన్నారు.
