Sunday, May 26, 2024
- Advertisement -

నాగబాబును ప‌చ్చి బూతులు తిట్టిన శ్రీరెడ్డి(వీడియో)

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మ‌ళ్లీ రెచ్చిపోతుంది. నిన్న‌టి వ‌ర‌కు ఫేస్‌బుక్‌లో సినీ ప్ర‌ముఖులపై విమ‌ర్శ‌లు చేసిన శ్రీరెడ్డి, ఇప్పుడు ఏకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టింది. ఫేస్‌బుక్‌లోనే ఎవ‌రు ఆమెను ఆప‌లేక‌పోయారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ర‌చ్చ మొద‌లుపెట్టింది. నిన్న‌టికి నిన్న బిగ్‌బాస్ కౌశ‌ల్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, అత‌నిపై చెప్పడానికి వీలు లేని ప‌దాల‌ను వాడింది. ఈ రోజు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుపై మండిప‌డింది శ్రీరెడ్డి. నాగ‌బాబు కూడా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ, వైసీపీ పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి నాగ‌బాబుకు కౌంట‌ర్ ఇచ్చింది.

నాగబాబు మాత్రమే వీడియోలు చేసి, చిడతలు కొడతాడా నేను కూడా వాయిస్తాను, నేను కూడా వీడియోలు చేస్తాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. టీడీపీ నాయ‌కురాలు యామినిపై నాగ‌బాబు చేసిన కామెంట్స్‌కు కౌంట‌ర్ ఇచ్చింది శ్రీరెడ్డి. నీచమైన ప్రవర్తన కలిగిన నాగబాబు ఏ మొహం పెట్టుకుని రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. జ‌న‌సేన‌లో మెంబ‌ర్‌వి కావు, పార్టీతో నాకు సంబంధం లేదంటూనే త‌మ్ముడికి నువ్వు చేసే సేవ‌లు ఎవ‌రికి తెలియ‌వు అనుకుంటున్నావా..?. 60 ఏళ్లు వ‌చ్చిన నీకు మ‌హిళ నాయ‌కురాలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియ‌దు. నీ కూతురిని ఎవ్వ‌రైన ఏదైనా అంటే నువ్వు ఊరుకుంటావా ? అంటూ నాగ‌బాబుని ప్ర‌శ్నించింది. కొన్ని చెప్పకూడ‌ని ప‌దాలను కూడా వాడి నాగ‌బాబుపై రెచ్చిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -