Thursday, May 16, 2024
- Advertisement -

బిగ్‌ బాస్‌లో నేను లేను…వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో!

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి బిగ్‌బాస్‌లో తాను లేన‌ని తెల్చేసింది.గ‌త కొన్ని రోజులుగా బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డిని తీసుకుంటున్నారని వార్త‌లు రావ‌డంతో అంద‌రు ఇది నిజ‌మే అని అనుకున్నారు.శ్రీరెడ్డి కూడా బిగ్‌బాస్‌లో పాల్గొంటే త‌న ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని భావించి ఆ దిశ‌గా చ‌ర్చ‌లు న‌డిపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.అయితే బిగ్‌బాస్-2 యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నానికి శ్రీరెడ్డికి విభేదాలు ఉన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.నానిపై వివాస్ప‌ద పోస్టులు పెట్టింది శ్రీరెడ్డి.

దీంతో బిగ్‌బాస్ టీమ్ ఆమె పేరును ప‌రిశీల‌న నుండి తొలగించారని సమాచారం.అయితే దీనిపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది.నేను బిగ్‌బాస్‌-2లో లేను.”ఇది నా దురదృష్టం .. నా స్నేహితులకు చేదు వార్త .. నేను ‘బిగ్ బాస్ 2’లో పాల్గొనడం లేదు. ఇది నా సన్నిహితులను అప్సెట్ చేసినా, కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు.చాలా మంది నేను షోలో లేను అనే సరికి పండుగ చేసుకుంటున్నార‌ని త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -