Thursday, May 2, 2024
- Advertisement -

మెంటల్ మదిలో ఎందుకు హైప్ చేస్తున్నారు..

- Advertisement -

మెంటల్ మదిలో పెళ్ళిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి చేస్తోన్న క్రేజీ వెంచర్ . ఈ సినిమా గురించి గత కొంతకాలంగా పాజిటివ్ ప్రమోషన్స్ ఎక్కువయ్యాయి. సినిమా ట్రైలర్ చూశాక…పెళ్లి చూపులు ఫీలింగే జనాల్లో కలుగుతుంది. అయితే ఈసినిమాలో చేసిన హీరో ..శ్రీ విష్ణు సినిమాలోని క్యారెక్టర్ కు కరెక్ట్ గా కనెక్ట్ అయ్యాడనే ఫీలింగ్ అందరిలోను వచ్చింది. కాని ఈసినిమాను పెళ్లి చూపులు స్థాయి చిత్రంగా ట్రీట్ చేయడం చూస్తుంటే… ఎక్కడో తేడా కొడుతుందనే విషయం కన్ఫామ్ అయింది.

రిలీజ్ కు ముందే సినిమాను అన్ని వర్గాలకు ప్రివ్యూల మాదిరిగా చూపిస్తూ ఉండడం చూస్తుంటే.. ఓ ఇన్ టెన్షన్ రాజ్ కందుకూరిలో ఉందనే విషయం మనకు అర్ధమైపోయింది. రేపు సినిమా రిలీజ్ అయ్యాక అది పెళ్లి చూపుల స్థాయి చిత్రమో కాదో పబ్లిక్ చెబుతారు. అంతేగాని ముందుగానే ఈసినిమా అంత ఇంత అని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే కొందరు వెబ్ మీడియా బ్యాచ్ ను మేనేజ్ చేసి… రాజ్ కందుకూరి పాజిటివ్ గా రాయించడం చూస్తుంటే… ఎందుకో.. అనవసర ప్రచారం కోసం పాకులాడుతున్నట్లుగా కనిపిస్తుంది. సినిమాకు ఎక్కువ థియేటర్లు వస్తాయనే ఉద్దేశ్యంతోటే సురేష్ ప్రొడక్షన్ తో నిర్మాత కమిటయ్యాడు. ఓవరాల్ గా చూస్తే… సినిమాకు ఇస్తోన్న వస్తోన్న ప్రమోషన్ అంతా… ఓ ఇన్ టెన్షన్ తో చేస్తుందనే విషయం స్పష్టమైపోతుంది.

https://www.youtube.com/watch?v=PPyIVFUtc2Y

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -