Sunday, May 19, 2024
- Advertisement -

జాహ్న‌వి డేర్‌… బ‌ర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు ఐల‌వ్‌యూ

- Advertisement -

దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నేటితో 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉన్న జాహ్నవి కపూర్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషెర్స్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జాహ్నవి కపూర్ బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ కూడా జాహ్నవిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విష్ చేశారు.

జాహ్నవి బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ కామెంట్ పోస్టు చేశాడు. అక్షత్ రంజన్ బర్త్ డే విషెష్‌పై…. జాహ్నవి కపూర్ వెంటనే స్పందించారు. ILY (ఐ లవ్ యూ) అంటూ రిప్లై ఇచ్చారు. తల్లి చనిపోయిన సమయంలో విషాదంలో ఉన్న జాహ్నవికి అక్షత్ రంజన్ ఎమోషనల్‌గా చాలా సపోర్టుగా ఉన్నారు.

కపూర్ ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్. శ్రీదేవి బ్రతికున్న సమయంలో బోనీ కపూర్ ఫ్యామిలీ ఔటింగ్‌కు వెళ్లిన సమయంలో అక్షత్ రంజన్ కూడా వారితో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వంలో వచ్చిన ‘డియర్ జిందగీ’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో శ్రీదేవి, బోనీ కపూర్, జాహ్నవిలతో కలిసి ఒకే కారులో అక్షత్ రంజన్ కనిపించడం అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -