Saturday, May 18, 2024
- Advertisement -

63 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట

- Advertisement -

ఒకటి ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం. మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం శ్రీమంతుడు. రెండు సినిమాలు తెలుగు వారికి మంచి ఆనందాన్ని పంచాయి. అంతే కాదు కలెక్షన్ల పరంగా కూడా రెండు సినిమాలు ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయి. ఇప్పుడు అవార్డుల విషయంలో కూడా ఈ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి.

63వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల బరిలో ఒక సినిమాపై మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ చిత్రాల హీరోలే కాదు… సాంకేతిక నిపుణులు కూడా పోటీలో ఉన్నారు. ప్రభాస్ నటించిన బాహుబలికి 9 నామినేషన్లు దక్కితే, శ్రీమంతుడు చిత్రానికి 8 నామినేషన్లు దక్కాయి. దీంతో పలు కేటగిరిల్లో ఈ చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడనున్నాయి.

ఇక చిన్న సినిమాగా విడుదలైన మళ్లీ మళ్లీ రాని రోజు చిత్రం సినిమాకు ఐదు నామినేషన్లు దక్కడం విశేషం. దక్షిణాది చిత్రాలకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఈసారి హైదరాబాద్ వేదిక కానుండడం విశేషం. ఈ నెల 18 న జరిగే ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి వచ్చే దక్షిణాది రాష్ట్రాల తారలతో హైదరాబాద్ వెలిగిపోబోతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -