Tuesday, April 30, 2024
- Advertisement -

కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్న కంపెనీ

- Advertisement -

అమెజాన్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం. ఆ కంపెనీ భారత్ లో పెట్టుబడుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. ఫ్లిప్ కార్ట్ తో పోటీ పడుతున్న అమెజాన్ భారత్ అగ్రస్ధానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దాదాపు మూడు వందల కోట్ల డాలర్లను అంటే 20, 169.75 కోట్ల రూపాయల కుమ్మరించేందుకు సిద్ధమవుతోంది.

అమెజాన్ కంపెనీ 2013 లో భారత్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2014లో రెండు వందల కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెడతామని కంపెనీ వెల్లడించింది. భారత్ లో స్ధానికంగా ఉన్న కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు అమెజాన్ పేర్కొంది.

ఇక్కడ 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని అమెజాన్ వ్యవస్ధాపకుడు, సిఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు. భాతర మార్కెట్ లో ఇప్పటికే 45 వేల ఉద్యోగాల కల్పన చేసామని, భవిష్యత్ లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2013 జూన్ లో భారత మార్కెట్లోకి వచ్చిన అమెజాన్  మూడేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సరుకు రవాణాలో అమెజాన్ కంపెనీ  స్నాప్ డీల్ ను దాటేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -