Thursday, March 28, 2024
- Advertisement -

బిగ్ బాస్: రూల్స్ అత్రిక్రమించిన శ్రీముఖి

- Advertisement -

బిగ్ బాస్ షో రోజురోజుకీ ఆసక్తికరం గా మారుతుంది. అయితే, ప్రస్తుతం ఇంట్లో క్యాప్టిన్సీ టాస్క్ నడుస్తుంది. అందులో భాగం గా శ్రీముఖి, రవికృష్ణ మరియు అషు రెడ్డి దొంగలు గా నటించారు. అయితే టాస్క్ లో భాగంగా లివింగ్ రూమ్ లో అద్దాల బాక్స్ ఒకటి ఉంటుంది, దానిని ఇంటి వాళ్ళు కాపాడుతూ ఉంటారు, వారి చెర నుండి దొంగలు కొట్టేయాలి. టాస్క్ లో భాగం గా శ్రీముఖి ఒక డంబ్ బెల్ తీసుకొని గ్లాస్ పగులగొట్టిన వెంటనే అందరూ ఆమె ని చుట్టూ ముట్టడం తో, ఆమె వేరే పక్క గ్లాస్ పగలగొట్టామని గట్టిగా అరవడం తో ఒక్కసారిగా చేత్తో నే రవికృష్ణ గ్లాస్ ని పగలగొట్టడం తో తన చేతికి భారీ గా కట్ అయింది.

అయితే దేనిని జీర్ణించుకోవడానికి అందరికీ కాస్త సమయం పట్టింది అని చెప్పుకోవచ్చు. ఆ వెంటనే శ్రీముఖి అలా చేసి ఉండకూడదు, రవికృష్ణ ని ఆలా రెచ్చకొట్టి ఉండకూడదు అని చెప్పడం తో, శ్రీముఖి బాధ పడింది. అంతే కాకుండా ఈ రోజు వచ్చిన ప్రోమో లో శ్రీముఖి రూల్స్ అతిక్రమించింది ని, బిగ్ బాస్ ఆమెని ఇంటి నుంచి బయటకి పంపే పరిస్థితి ఉంటుంది అని హెచ్చరించారు. ఇంతకీ ఆమె హౌస్ లో ఉంటుందా లేదా అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -