Friday, May 3, 2024
- Advertisement -

ఉత్కంఠ‌పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను గెలిపించిన బ‌ట్ల‌ర్‌…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. చెన్నైతో జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో విజ‌యం సాధించింది ప్లేఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (95 నాటౌట్: 60 బంతుల్లో 11×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్తాన్‌ ప్రతీకారం తీర్చుకుంది.

రాజస్తాన్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌(95 నాటౌట్‌;60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. అతనికి జతగా శాంసన్‌(21), స్టువర్ట్‌ బిన్నీ(22)లు ఫర్వాలేదనిపించారు. 6 బంతుల్లో 12 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన డ్వేన్ బ్రావో ఓవర్‌లో ఓ సిక్స్, మూడు డబుల్స్ తీసిన బట్లర్.. ఒక బంతి మిగిలి ఉండగానే జట్టుని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.

అంతకముందు సురేశ్ రైనా (52: 35 బంతుల్లో 6×4, 1×6), షేన్ వాట్సన్ (39: 31 బంతుల్లో 2×4, 2×6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (33 నాటౌట్: 23 బంతుల్లో 1×4, 1×6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఛేదనలో బెన్‌ స్టోక్స్ (11), రహానె (4), సంజు శాంసన్ (21), ప్రశాంత్ చోప్రా (8) విఫలమైనా.. ఆఖర్లో స్టువర్ట్ బిన్నీ (22: 17 బంతుల్లో 1×4, 1×6), గౌతమ్ (13: 4 బంతుల్లో 2×6) హిట్టింగ్‌తో బట్లర్‌పై ఒత్తిడి తగ్గించారు. డెత్ ఓవర్లలో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌లను షేన్ వాట్సన్, మహేంద్రసింగ్ ధోనీ జారవిడచడం చెన్నై విజయావకాశాల్ని దూరం చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, ఇష్‌ సోథీకి ఓ వికెట్‌ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -