Monday, May 6, 2024
- Advertisement -

బాలకృష్ణ ని దారుణంగా మోసం చేసిన తమన్..?

- Advertisement -

తెలుగు సినిమా లో మ్యూజిక్ డైరెక్టర్ లు ఎందఱో ఉండచ్చు గానీ, తమన్ ది చాలా ప్రత్యెక స్థానం. కిక్ ఫస్ట్ పార్ట్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా తక్కువ కాలం లోనే ఏకంగా యాభై సినిమాలకి మ్యూజిక్ ఇచ్చేసాడు తమన్.

కిక్ 1 నుంచి కిక్ 2 కి వచ్చే లోగా తమన్ యాభై సినిమాలకి మ్యూజిక్ ఇచ్చేసాడు అంటే రవితేజ నే ఒక సందర్భంలో ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాడు. 

తమన్ కి ఎంత ఫేం ఉందొ అంత బ్యాడ్ నేమ్ కూడా ఉంది. సినిమాల్లో పాటలు కాపీ కొడతాడు అని, ఎక్కడో ఉన్న పాటలు లేపేసి తన సినిమాల్లో అతికిస్తాడు అని చెడ్డ పేరు మూట గట్టుకున్నాడు. తమన్ తొలి సినిమా కిక్ అప్పుడే ఇలాంటి రెండు మూడు వార్తలు వచ్చినా కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా రూపాంతరం చెందే కొద్దీ తమన్ మీద ఇలాంటివి చాలా ఎక్కువగా పడ్డాయి. నిజానికి మణిశర్మ దగ్గర నుంచీ దేవీ దాకా కీరవాణీ లాంటి వారు కూడా మ్యూజిక్ దొంగలే కానీ తమన్ మీద ఫోకస్ ఎందుకో మరి చాలా ఎక్కువగా పడింది. ముఖ్యంగా “డప్పు” కొట్టుడు మ్యూజిక్ అంటూ అనేవారు. 

తమన్ ఆడియో వస్తోంది అంటే చాలు తమన్ పాటలు ఎక్కడ ఎక్కడ నుంచే లేపెసాడో అని చూడడానికి ఓక్ బ్యాచ్ ఇప్పటికీ సిద్దం గా ఉంటోంది. తాజాగా బాలకృష్ణ కి మొట్టమొదటి సారి మ్యూజిక్ ఇచ్చిన తమన్ బాబు మొన్న వినాయక చవితి పవిత్ర దినాన వినాయకుడి మీద ఒక పాట ని విడుదల చేసాడు ఆ పాట వింటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే ఆ పాట ని బజరంగీ భాయ్ జాన్ లోని సేల్ఫీ లేలేరే అనే పాటలోంచి లేపెసినట్టు ఇట్టే చెప్పేయచ్చు. 

ఈ రకంగా ఇదివరకు బిజినెస్ మ్యాన్ లో పిల్లా చావ్ పాట, రేసు గుర్రం లో స్వీటీ పాటా ఇలా ఒకటేవిటి యావరేజ్ గా సినిమా కి రెండు పాటలు లేపేయడం తమన్ కి అలవాటే.  కానీ అందరి సినిమాలూ వేరు బాలయ్య సినిమా వేరు అందరు హీరోలు ఊరుకున్నట్టు తనని మోసం చేస్తే బాలయ్య ఊరుకుంటాడా? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -