Saturday, May 18, 2024
- Advertisement -

అర్ధనగ్న చిత్రాలు పోస్టు చేస్తున్న స్టార్ హీరో కూతురు!

- Advertisement -

జాకీ ష్రాఫ్.. ఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరో, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అదే స్థాయిలో కొనసాగాడాయన. ఈ మధ్య నే జాకీ తనయుడు టైగర్ ఫ్రాఫ్ హీరోగా కూడా పరిచయం అయ్యాడు.

మరి బాలీవుడ్ లో కేవలం హీరోల తనయులే కాదు.. కూతుర్లుకూడా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అవుతూ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఇలాంటి పరంపరలో ఇప్పుడు జాకీ తనయ కూడా చేరింది. తన పేరు కృష్ణ.. కృష్ణ ష్రాఫ్. 

 ఇంకా పూర్తిస్థాయిలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కాని కృష్ణ తనకంటూ గుర్తింపును సంపాదించుకోవడానికి చిత్రమైన వ్యూహాన్ని ఎంచుకొంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ఆమె తన చిత్రాలను పోస్టు చేస్తోంది. అది కూడా అర్ధనగ్నంగా! ఇలాంటి అర్ధనగ్న చిత్రాలను పోస్టు చేసి ఆమె గుర్తింపును సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు ఇన్ స్టాగ్రమ్ ను వేదికగా ఎంచుకొందామె. ఆ సైట్ లో తన పోస్టులు పెడుతూ అందరి దృష్టినీ ఆకర్షించడానికి ఆమె ప్రయత్నిస్తోంది. మరి ఇది కొంచెం చిల్లర ఎత్తుగడే అనుకోవాలి. ఇలాంటి ఎత్తుగడతో జాకీ కూతురు ఎంతస్థాయికి ఎదుగుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -