Sunday, May 19, 2024
- Advertisement -

విడాకులు తీసుకున్న హీరోతో నిత్యామీనన్ ప్రేమాయణమా!

- Advertisement -

ఇంత వరకూ గాసిప్పులకు ప్రేమాయణ కబుర్లకు చాలా దూరంగా నిలిచింది నిత్యామీనన్. వ్యక్తిగతంగా చాలా స్ట్రిక్ట్ గా కనిపించే నిత్య ఇంత వరకూ ఎలాంటి గాసిప్స్ లోనూ నిలవలేదు.

ఈ మలయాళ కుట్టి తెరమీద ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉన్నట్టే..తెరవెనుక కూడా ఎలాంటి అనుమానాలకూ తావివ్వలేదు. అయితే ఇప్పుడు మాత్రం అందులో చిన్న మార్పు. ఏకంగాఒక హీరోతో ఎఫైర్ అంటూ నిత్య పేరు చర్చలోకి వచ్చింది. ఆమె కన్నడ హీరోతో ప్రేమలో మునిగి తేలుతోందని వార్తలు వస్తున్నాయి.

ఆయన మరెవరో కాదు.. సుదీప్, ఈగ సినిమాలో విలన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న ఈ కన్నడ స్టార్ హీరో నిత్యతో ప్రేమలో పడ్డాడని.. నిత్య కూడా ఆయనతో ప్రేమలో పడిందని వార్తలు గుప్పుమంటున్నాయి. నిత్య కన్నా సుదీప్ వయసులో చాలా పెద్ద వాడు కూడా.  అంతే కాదు.. ఇటీవలే ఆయన విడాకులు తీసుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకూ, నిత్యకు ప్రేమ మొదలైందని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రేమ గురించి కన్నడ నాట ఇలాంటి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాల గురించి తెలిసింది నిత్యా, సుదీప్ లకు మాత్రమే. వాళ్లైతే ప్రస్తుతానికి ఈ అంశం గురించి నోరు విప్పడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై క్లారిటీ రావడానికి మరికొంత కాలం పడుతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -