Sunday, May 5, 2024
- Advertisement -

సినిమాలపై ఆసక్తి లేదు అంటున్న స్టార్ కిడ్

- Advertisement -

ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ టాలీవుడ్లో హీరోలుగా పరిచయమయ్యారు. అయితే నందమూరి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. చాలా కాలంగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా సినిమాలలో అడుగుపెట్టబోతున్నాడు అంటూ బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇప్పటిదాకా కేవలం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సమయంలో కొంతకాలం క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు కానీ దర్శకత్వం మీద కూడా అతని ఆసక్తి ఎక్కువ కాలం నిలవలేదు.

మరోవైపు బాలకృష్ణ లాగా మోక్షజ్ఞ కూడా నటుడిగా మారతాడని అందరూ అనుకున్నారు కానీ మోక్షజ్ఞ కి సినిమాలపై కూడా అంతగా ఆసక్తి లేదట. ఇప్పుడు మోక్షజ్ఞ కి పాతికేళ్ళు వచ్చాయి. అభిమానులు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా మారతాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ మాత్రం సినిమాల గురించి నటన గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ తన 25వ పుట్టినరోజు జరుపుకుంటుండగా అభిమానులు కొన్ని ఎడిటెడ్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అతనికి శుభాకాంక్షలు చెప్పారు.

నిన్న ఏదో ఒక టైం లో మోక్షజ్ఞ గురించి ప్రకటన వస్తుంది అని అంతా అనుకున్నారు కానీ ఏమి రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -