Monday, May 13, 2024
- Advertisement -

బుద్ధిమారని పాకిస్థాన్..మరో సారి కుక్కతోక వంకరే అనిపించకుంది..

- Advertisement -

పాకిస్థాన్ బుద్ధి మారలేదు. ఏ చిన్న అవకాశం దక్కినా భారత్‌పై ఉన్న అక్కసునంతా వెళ్లగక్కుతోంది. సొంతంగా స్పేస్ లోకి శాటిలైట్ ను పంపించుకోలేని పాక్ చంద్రయాన్ 2 విఫలంపై చీఫ్ కామెంట్టు చేసింది. అది కూడా సామాన్యులు కాదు. ఏకంగా ఆదే సైన్స్ మంత్రి ఫవాద్‌ చౌదరి .

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగి ఆగిపోయిన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు నిధానంగా సాగిన చంద్రయాన్ 2 ప్రయాణం ..విక్రమ్ ల్యాండర్‌ పయనం.. ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోవడంతో చివరలో విఫలం అయ్యింది.

అయితే దీనిపై మంత్రి ఫవాద్ ట్విట్టర్ లో చీఫ్ కామెంట్స్ చేశారు. ‘రాని పనిలో వేలు పెట్టొద్దు.. డియర్‌ ఎండియా (Dear “Endia” )’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌కు 8,800లకుపైగా కామెంట్లు వచ్చాయి.మంత్రులు, అధికారులతో పాటు అక్కడి నెటిజన్లు కూడా ఈ ప్రయోగంపై చత్వారపు ట్వీట్లు చేస్తున్నారు. ఇండియా ఫెయిల్ద్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు.

పలువురు భారత నెటిజన్లు ఫవాద్‌ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రాయాన్‌-2లో కితకితలు పెట్టే అంశమేమిటంటే.. అది రాత్రంతా ఫవాద్‌ను మేల్కొనే చేసింది’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశారు. పలువురు పాకిస్థానీ నెటిజన్లు కూడా ఫవాద్‌ తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. భారత్‌ కనీసం ప్రయత్నమన్నా చేసిందని, అలాంటి ప్రయత్నాన్ని కించపరచడం పాకిస్థాన్‌ పేరును చెడగొట్టడమే అవుతుందని పలువురు నెటిజన్లు సూచించారు. పాకిస్తాన్ స్లేవ్ టు ఇండియా, వర్త్ లెస్ పాకిస్తాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు.

అయినా మంత్రి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. మరో సారి తన అక్కసు వెల్లగక్కుతూ ట్వీట్ లు చేశారు.చంద్రాయన్‌-2 వైఫల్యానికి తానే కారణమైనట్టు ఇండియన్‌ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారని, చంద్రాయన్‌ బొమ్మ మూన్‌పైన కాకుండా ముంబైలో ల్యాండ్‌ అయిందని ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. మోదీ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ మీద ప్రసంగాలు చేస్తున్నారని, ఆయన నిజానికి పొలిటిషియన్‌ కాకుండా ఆస్ట్రోనాట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. పాక్ బుద్ధి మరోసారి కుక్కతోక వంకరే అని నిరూపించుకుంది.

https://twitter.com/Srijesh_Offl/status/1170222630265212928

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -