Saturday, May 11, 2024
- Advertisement -

పూరి-ఛార్మి కాంబినేషన్ లో బాస్ లేడీ?

- Advertisement -

ప్రస్తుతం ఛార్మి సినిమా లకి నటిగా దూరంగా ఉనప్పటికి నిర్మాతగా చాలా దగ్గరగా ఉంది. పురి జగన్నాథ్ తో నిర్మాణ భాగస్వామిగా చేతులు కలిపి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు అందించాలి అని తపన తో ముందుకు వెళ్తుంది. అయితే తన పుట్టిన రోజు ఈ రోజు జరుగుపుకుంటుండగా ఒక రోజు ముందుగా తను నిర్మిస్తున్న ఇష్మార్ట్ శంకర్ సినిమా లో హీరో రామ్ పోతినేని ఛార్మి కి ఒక పెద్ద సర్ప్రైజ ఇచ్చాడట.

ఇదే విషయాన్ని ఛార్మి ట్విట్టర్ లో చెప్తూ ఈ కింది విధంగా పోస్ట్ చేసింది. “నా పుట్టిన రోజు కి ఇంకా ఒక రోజు ఐనప్పటికీ అప్పుడే నన్ను రామ్ సర్ప్రైజ్ చేశాడు. నేను ఎప్పటి నుంచో ఒక దానికోసం ఎదురు చూస్తున్నాను అది నాకు ఎంతో ఇష్టం అని తెలిసి దానినే నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు రామ్ పైగా దాని పైన బాస్ లేడీ అని రాసిన వ్యాఖ్య నన్ను ఎంతగానో నవ్వించింది. ఇష్మార్ట్ శంకర్ కి థాంక్స్ యూ” అని ఛార్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం పూరి చార్మీ తో “బాస్ లేడీ” అనే సినిమా ని తీయాలి అని అనుకుంటున్నాడట. ఇదే విషయాన్నీ ఇన్ డైరెక్ట్ గా రామ్ కన్వే చేసాడని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయి కానీ షూట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుండగా, ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -