Friday, April 19, 2024
- Advertisement -

విషాదంలో టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి అస్త‌మ‌యం

- Advertisement -

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు (63) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న న‌గ‌రంలోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌య‌మించ‌డ‌తో సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. సుమారు 850కి పైగా చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో నిండిపోయింది. కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని మోతీనగర్ లోని నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది.

రాళ్లపల్లి 1955 అక్టోబరు 10న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. ఆయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు.సితార, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, ఆలాపన తదితర చిత్రాల్లో ఆయన నటించారు.నాటక రంగం నుండి వచ్చిన ఆయన సుమారు 8 వేల నాటకాలకు పైగా నటించారు.

రాళ్లపల్లి తన కెరీర్ లో సుమారు 800కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయన సొంతం. ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తొలిసారి నంది పురస్కారాన్ని అందుకున్నారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు చిత్రాలు రాళ్లపల్లికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలకపాత్రల్లో రాళ్లపల్లికి నటించే అవకాశం వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -