Saturday, May 18, 2024
- Advertisement -

సుబ్రమణ్యం బావగారు బాగున్నారాను ఫాలో అయ్యాడా..?

- Advertisement -

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం రిలీజ్ అయిన మార్నింగ్ షోతోనే ఎబౌ యావరేజ్ టాక్ తో సందడి చేస్తోంది. అయితే సినిమాను చూసిన జనాలకు మాత్రం ఈసినిమాను మనం గతంలో చూసామే అన్న ఫీలింగ్ కలుగుతుంది.

అయితే ఆసినిమా ఏంటానేది స్ట్రైక్ కావడం లేదు. సరిగ్గా చూస్తే…మనకు కనిపించేది ఒక్కటే.అదే బావగారు బాగున్నారా. ఆసినమాలో కూడా చిరంజీవి ఏదో రచనకు న్యాయం చేద్దామని ఇంటి అల్లుడుగా వచ్చి అసలు విషయం తెలియజేసి మరదలను మనువాడుతాడు.

అయితే ఇక్కడ రంభ, రచన ఇద్దరూ రెజీనానే. అలాగే బావగారు బాగున్నారాలో ఇండియాలో స్టోరీ జరుగుతుంది. ఇక్కడ ఫారన్ లో స్టోరీ జరుగుతుంది. అంతే తేడా. 

ఇక సెకండాఫ్ లో నిప్పు, కందిరీగ తరహా లైన్ కనిపిస్తుంది.విలన్ చెల్లిని మనువాడమని విలన్ హీరో వెంటపడి వేదించడం.

అదే ఇక్కడ కూడా కనిపించింది. అయితే హరీష్ శంకర్ ఎంతో తెలివిగా…ఈ ఫీల్ సగటు సినీ ప్రేక్షకుడికి కలిగించకుండా స్క్రిప్ట్ ను నడిపించాడు.అలాగే డైలాగ్స్ విషయంలో బ్రహ్మీతో చెప్పించిన పంచ్ లు ఠారెత్తించాయి.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రివ్యూ:

https://www.youtube.com/watch?v=RJUuNuYefHQ

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -