Sunday, May 5, 2024
- Advertisement -

హాలీవుడ్‌లో కన్నడ స్టార్‌కు అవ‌కాశం

- Advertisement -

హాలీవుడ్‌లో ఓ క‌న్న‌డ స్టార్‌కు బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది. అయితే క‌న్న‌డ హీరో గురించి మ‌న‌కు ఎందుకు అనుకోవ‌ద్దు. క‌న్న‌డ‌లో సూప‌ర్ స్టార్ అయినా మ‌న తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలిసిన‌వాడే. ‘ఈగ’ సినిమాతో తెలుగువారికి కిచ్చ సుదీప్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ క్రమంలో బాహుబలిలో కూడా క‌నిపించాడు. ఇక శాండల్‌వుడ్‌లో ఆయనకు స్టార్ హోదా ఉంది. డూప్‌లు లేకుండా స్టంట్లు చేయటం ఆయనకు ప‌రిపాటు.

ప్రస్తుతం ఆయ‌న స్టార్‌ శివరాజ్‌కుమార్‌తో విలన్‌ అనే మల్టీస్టారర్‌ చిత్రంలో చేస్తున్నాడు. ఆ క్ర‌మంలో ఆయ‌న‌కు హాలీవుడ్‌ డెబ్యూకి రెడీ అయిపోయాడు. ఆస్ట్రేలియా ఫిల్మ్‌ మేకర్‌ ఈడై ఆర్య రూపొందించబోయే ఓ యాక్షన్ సినిమాలో సుదీప్‌ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విష‌యాన్ని సుదీప్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. ఇంకా సినిమా పేరు ప్ర‌క‌టించ‌లేదు. హాలీవుడ్ సినిమాలో ఆర్మీ అధికారి పాత్ర‌లో కనిపించనున్నారట‌.

రష్యాలో వేలాది మందిని బలి తీసుకున్న ఓ పేలుడు నేపథ్యంలో ఈ సినిమా తీయ‌నున్నార‌ట‌. యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ఉన్న ఈ సినిమాలో క‌న్న‌డ నుంచి అవ‌కాశం పొందాడు. వేస‌వి నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమ‌వుతుందంట‌. అయితే ఈ సినిమా కోసం సుదీప్ ఆతృతంగా ఎదురుచూస్తున్న‌ట్టు పేర్కొన్నారు.ప్ర‌స్తుతం సుదీప్ తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తున్న సైరా సినిమాలో ఓ పాత్రలో న‌టించ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -