Saturday, April 20, 2024
- Advertisement -

జబర్దస్త్ స్టేజ్ మీదా రష్మీకి ప్రపోజ్ చేసిన సుధీర్..! (వీడియో)

- Advertisement -

తెలుగు బుల్లితెర పై ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ లోకి వచ్చి టీం లీడర్ గా ఎదిగి.. యాంకర్ గా చేస్తూ.. జబర్దస్త్ లో చేస్తూ.. సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. అలానే తనదైన అందంతో కట్టిపడేస్తూ హాట్ యాంకర్‌గా వెలుగొందుతోన్న వారిలో రష్మీ గౌతమ్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

ఇలా తమకు తామే సాటి అని నిరూపించుకుంటూ దూసుకెళ్తున్న ఈ ఇద్దరు టెలివిజన్ సెలెబ్రిటీల మధ్య ఏదో నడుస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే ఏదో ఒక సమయంలో ఈ ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. దీంతో రష్మీ – సుధీర్‌ను యూట్యూబ్ జోడీ అని పిలుస్తుంటారు. దీనికి కారణం వాళ్లిద్దరిపై అక్కడ వచ్చిన స్టోరీలే. దీంతో వీళ్లు పలుమార్లు తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరి మధ్య ఏమి లేదని కూడా తేల్చేశారు. సుధీర్ – రష్మీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని చాలా మంది మేకర్స్ పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం వీరిద్దరి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్స్ ని క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా ఎక్ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14కి సంబంధించింది. అయితే ఈ ప్రోమోలో రష్మీకి సుధీర్ ప్రపోజ్ చేశాడు. వెన్నెలవే వెన్నెలవే అనే పాటకు ఇద్దరు రొమాంటిక్ గా డాన్స్ వేస్తూ.. ’రష్మీ.. నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను. నిన్ను మరిచిన మరుక్షణమే నేను ప్రాణాలతో ఉండను. హ్యాపీ వాలెంటైన్’స్ డే’ అంటూ రష్మీకి ప్రపోజ్ చేశాడు సుధీర్. అందుకు రష్మీ సిగ్గు పడింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -