Wednesday, April 24, 2024
- Advertisement -

దీనివల్లే కరోనా వైరస్ వస్తుందట.. ఆ జీవి పేరు ఏంటంటే ?

- Advertisement -

ప్రపంచాన్ని భయపెడుతుంది కరోనా వైరస్. అయితే ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోందన్న విషయంపై చైనా శాస్త్రవేత్తలు చెబుతున్న దాంట్లో ఒకదానికి ఒకటి పొంతన ఉండటం లేదు. పాములు, గబ్బిలాల వల్లే కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చని మొదట చెప్పిన శాస్త్రవేత్తలు తాజాగా.. అలుగు (పాంగొలిన్) కూడా ఈ వైరస్ కు కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్‌తో 99 శాతం సరిపోలుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లోనూ అలుగులను తింటారు. దీంతో వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉంటుందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 636కి చేరగా, 31,161 మందికి సోకినట్టు అధికారులు తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా ఒక్క రోజులో 73 మంది మృతి చెందగా, వారిలో 69 మంది మంది హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. మరోవైపు, ఐరోపా దేశాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. ఆయా దేశాల్లో 31 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -